దంతాల‌ను తెల్ల‌గా మెరిపించే అర‌టి తొక్క‌లు.. ఎలా వాడాలో తెలుసా?

దంతాలు తెల్ల‌గా మెరుస్తూ క‌నిపిస్తే ఎంత బాగుంటాయో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్పాల్సిన ప‌ని లేదు.కానీ, కొంద‌రి దంతాలు తెల్ల‌గా కాకుండా ప‌సుపు రంగులో ఉంటాయి.

రోజుకు రెండు సార్లు బ్ర‌ష్ చేసుకున్నా, ఎంత ఖ‌రీదైన టూత్ పేస్ట్ ల‌ను వాడినా దంతాలు తెల్ల‌గా మార‌వు.దాంతో మ‌న‌స్పూర్తిగా న‌వ్వ‌లేక‌, ఇతరుల‌తో ధైర్యంగా మాట్లాడ‌లేక లోలోన మ‌ద‌న ప‌డిపోతూ ఉంటారు.

ప‌సుపు రంగులో ఉండే త‌మ దంతాల‌ను చూసి ఎదుటివారు ఎక్క‌డ ఎగ‌తాళి చేస్తారో అన్న భ‌యం నిత్యం వెంటాడుతూనే ఉంటుంది.ఆ భ‌యం మీకు ఉందా.? అయితే అస్స‌లు వ‌ర్రీ అవ్వ‌కండి.ఎందుకంటే, ప‌సుపు రంగులో ఉండే దంతాల‌ను తెల్ల‌గా త‌ళ‌త‌ళా మెరిపించే ఔష‌ధం మీ ఇంట్లోనే ఉంది.

అదే అర‌టి పండు.సీజ‌న్‌తో ప‌ని లేకుండా ఏడాది పొడ‌వునా ల‌భించే అర‌టి పండ్లు దాదాపు అంద‌రి ఇళ్ల‌ల్లోనూ విరి విరిగా ఉంటాయి.

Advertisement

అయితే అర‌టి పండును తినేసి తొక్క‌ను పారేస్తుంటారు.కానీ, తొక్క‌తోనూ ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

ముఖ్యంగా గార‌ప‌ట్టి ప‌సుపు రంగులోకి మారిన‌ దంతాల‌ను తెల్ల‌గా మెరిపించే సామ‌ర్థ్యం అర‌టి తొక్క‌లకు ఉంది.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అర‌టి తొక్క‌ల‌తో దంతాల‌ను ఎలా మెరిపించుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక అర‌టి పండుకు ఉన్న తొక్క‌ను తీసుకోవాలి.ఆ తొక్క‌ లోప‌లి వైపు తెల్ల‌గా ఉండే ప‌దార్థాన్ని స్పూన్ సాయంతో తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.

ఇప్పుడు ఈ తెల్ల‌టి ప‌దార్థంలో పావు టీ స్పూన్ ప‌సుపు, పావు టీ స్పూన్ సాల్ట్‌, వ‌న్ టేబుల్ స్పూన్ వైట్ టూత్ పేస్ట్ వేసుకుని బాగా క‌ల‌పాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని టూత్ బ్ర‌ష్ సాయంతో దంతాల‌కు అప్లై చేసి సున్నితంగా రెండు నుంచి మూడు నిమిషాల పాటు తోముకోవాలి.ఆపై గోరు వెచ్చ‌ని నీటితో దంతాల‌ను, నోటిని శుభ్రం చేసుకోవాలి.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
ఏంటి భయ్యా.. లక్షల కోట్లకు అధిపతిని రెస్టారెంట్ కి వెళ్తే గుర్తు పట్టలేకపోయారు!

రోజుకు ఒక‌సారి ఇలా చేస్తే ప‌సుపు దంతాలు తెల్ల‌గా మిల‌మిలా మెర‌వ‌డం ఖాయం.

Advertisement

తాజా వార్తలు