Watermelon Crop : పుచ్చకాయ పంట విత్తుకునే విధానం.. కలుపు నివారణకు చర్యలు..!

పుచ్చకాయ పంట( Watermelon Crop ) వేసవికి అనువైన పంట.అయితే ఏడాది పొడవునా అన్ని కాలాలలో సాగు చేసేందుకు అనువైన విత్తన రకాలు అందుబాటులోకి రావడం వల్ల రైతులు అన్ని కాలాల్లో పుచ్చకాయ పంట సాగు చేస్తున్నారు.

 How To Sow Watermelon Crop Measures For Weed Prevention-TeluguStop.com

పొడి వాతావరణం ఉంటే పుచ్చకాయ సాగులో అధిక దిగుబడులు పొందవచ్చు.మార్కెటింగ్ కు అనువుగా ఉండాలంటే.

అధిక విస్తీర్ణంలో ఒకేసారి కాకుండా విడతల వారీగా విత్తుకొని సాగు చేయాలి.పుచ్చకాయ పంట సాగుకు నల్లరేగడి నేలలు, సారవంతమైన ఇసుక నేలలు, ఎర్ర నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఒక ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 25 కిలోల యూరియా, 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు( Potash fertilizers ) వేసుకోవాలి.

Telugu Farmers, Method, Watermelon Crop, Watermelon, Weed, Zig Zag Method-Latest

పుచ్చకాయ పంటను బోదెల పద్ధతి, ఎత్తు బెడ్ల పద్ధతిలో సాగు చేయవచ్చు.ఏ పద్ధతిలో సాగు చేసిన విత్తనం విత్తేటప్పుడు జిగ్ జాక్ పద్ధతి( Zig Zag method ) అనుసరించి ఎత్తు బెడ్లకు రెండు వైపుల ఏదంటే బోదెకు రెండు వైపుల విత్తుకోవాలి.మొక్కల మధ్య 75 సెంటీమీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య 120 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు విత్తనం విత్తుకోవాలి.

పుచ్చకాయ సాగులో కలుపును తొలగించడం అత్యంత కీలకం.అంటే కలుపు మొక్కలు చీడపీడలకు( Pests ) మరియు తెగుళ్ళకు అతిథి మొక్కలుగా వ్యవహరిస్తాయి.కలుపు సమస్య లేకపోతే పంటకు చీడపీడల తెగుళ్ల బెడద చాలా అంటే చాలా తక్కువ.పైగా తెగుళ్ల, చీడపీడల వ్యాప్తి ఎక్కువగా ఉండదు.

Telugu Farmers, Method, Watermelon Crop, Watermelon, Weed, Zig Zag Method-Latest

కలుపు సమస్య పెద్దగా ఉండకూడదంటే విత్తనం నాటుకున్న 48 గంటల లోపు ఒక లీటరు నీటిలో ఐదు మిల్లీమీటర్ల పెండిమిథలిన్ ను కలిపి నేల పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.మల్చింగ్ పద్ధతి వల్ల కలుపు ను కొంతమేరకు నిర్మూలించవచ్చు.విత్తిన నెల రోజుల వ్యవధిలో పొలంలో అంతర కృషి చేపట్టాలి.దీంతో కలుపు సమస్యకు దాదాపుగా పెట్టినట్టే.ఇక నేలలోని తేమశాతాన్ని బట్టి వారం రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి.పుచ్చకాయ పక్వానికి వచ్చే సమయంలో నీటిని అందించడం తగ్గించాలి.

ఎందుకంటే పుచ్చకాయ పక్వానికి వచ్చే సమయంలో నీటిని ఎక్కువగా అందిస్తే కాయలు పగిలిపోయే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube