మీ ముఖం, మెడ తెల్ల‌గా మెర‌వాలా? అయితే రాగి పిండితో ఇలా చేయండి!

రాగి పిండితో మ‌న భార‌తీయులు ఎన్నో వంట‌లు చేస్తుంటారు.రాగి జావ‌, రాగి లడ్డూ, రాగి దోసె, రాగి ఇడ్లీ.

ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో చాలానే ఉన్నాయి.అయితే రాగి పిండితో ఏ వంట‌కం చేసినా రుచి సూప‌ర్‌గా ఉంటుంది.

పైగా రాగి పిండిలో ఎన్నో పోష‌క విలువ‌లు నిండి ఉంటాయి.అవి ఆరోగ్యానికే కాదు.

చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా ఎన్నో విధాలుగా స‌హాయ‌ప‌డ‌తాయి.ముఖ్యంగా చాలా మంది త‌మ ముఖాన్ని, మెడ‌ను తెల్ల‌గా మెరిపించుకునేందుకు మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే ర‌క‌ర‌కాల ప్రోడెక్ట్స్‌ను వాడుతుంటారు.

Advertisement
How To Get Whitening Face And Neck? Whitening Face And Neck, Skin Care, Skin Car

అయితే అలాంటి వారికి రాగి పిండి బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పుకోవ‌చ్చు.అవును, రాగి పిండిలో ఉండే కొన్ని ప్ర‌త్యేక‌మైన పోష‌కాలు స్కిన్ టోన్‌ను పెంచ‌డంలోనూ ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తాయి.

మ‌రి ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా రాగి పిండిని చ‌ర్మానికి ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Get Whitening Face And Neck Whitening Face And Neck, Skin Care, Skin Car

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల రాగి పిండి, ఒక స్పూన్ లెమ‌న్ పీల్ పౌడ‌ర్‌, ఒక స్పూన్ చంద‌నం పొడి మ‌రియు ప‌చ్చి పాలు స‌రిప‌డా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మెడ‌కు మ‌రియు ముఖానికి అప్లై చేసి ప‌దిహేను లేదా ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌న‌వ్వాలి.అపై గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

రెండు రోజుల‌కు ఒక సారి ఈ ప్యాక్‌ను ట్రై చేస్తే.కేవ‌లం కొద్ది రోజుల్లోనే ముఖం, మెడ తెల్ల‌గా, మృదువ‌గా మార‌తాయి.

How To Get Whitening Face And Neck Whitening Face And Neck, Skin Care, Skin Car
ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల రాగి పిండి, ఒక స్పూన్ బియ్యం పిండి, రెండు స్పూన్ల తేనె మ‌రియు రెండు లెమ‌న్ జ్యూస్ వేసుకుని బాగా క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మానికి ఫేస్‌కు, నెక్‌కు ప‌ట్టించి.కాసేపు ఆర‌నివ్వాలి.

Advertisement

అనంత‌రం వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా రుద్దుకుంటూ వాష్ చేసుకోవాలి.వారంలో మూడు, నాలుగు సార్లు ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

తాజా వార్తలు