బియ్యం నీటితో ఎన్ని చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చో తెలుసా??

బియ్యం.ముఖ్యంగా మ‌న భార‌త‌దేశంలో వీటిని విరివిరిగా ఉప‌యోగిస్తారు.బియ్యంతో రైస్ వండి.

ఏదైనా క‌ర్రీ కాంబినేష‌న్‌తో తింటుంటారు.అయితే బియ్యాన్ని వండే ముందు రెండు, మూడు సార్లు క‌డుగుతార‌న్న విష‌యం తెలిసిందే.

అలా క‌డిగిన నీరును సాధార‌ణంగా ఎవ‌రైనా బ‌య‌ట పార‌పోస్తారు.కానీ, అలా చేయ‌డం చాలా పొర‌పాటు.

ఎందుకంటే.మ‌న చ‌ర్మ సౌంద‌ర్యాన్ని రెట్టింపు చేసే గుణాలు ఆ బియ్యం నీటిలో బోలెడ‌న్ని ఉన్నాయి.అవును! వృధాగా పారబోసే ఆ నీటితో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.

Advertisement
How Can Use Rice Water For Glowing Skin??, Rice Water, Glowing Skin, Beauty Tip

అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.బియ్యం నీటిలో కాట‌న్ బాల్ ముంచి ముఖానికి అప్లై చేయాలి.

ఆరిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.

How Can Use Rice Water For Glowing Skin, Rice Water, Glowing Skin, Beauty Tip

ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా చేయడం వల్ల మీ చర్మం తాజాగా, మృదువుగా మారుతుంది.అలాగే బియ్యం నీరుతో ప్రతిరోజూ ముఖం కడుగుతూ ఉంటే మొటిమలు, మచ్చలు తగ్గుముఖం పడుతాయి.ఇలా చేయ‌డం వ‌ల్ల చర్మం మీద దద్దుర్లు, మంటలు వంటి చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.

అదేవిధంగా, బియ్యం నీటితో కొద్దిగా తేనె క‌లిపి.ముఖానికి అప్లై చేయాలి.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
ఆ హోటల్‌లో వడలు చూస్తే అమితాబ్ బచ్చన్ ఆగలేరంట.. ఎక్కడంటే..?

పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల చర్మంపై పడిన ముడుతలు త‌గ్గుతాయి.

Advertisement

మ‌రియు చర్మ రంధ్రాలు తగ్గించి చర్మాన్ని బిగుతుగా మారేలా చేస్తుంది.అదేవిధంగా, బియ్యం కడిగిన నీటిలో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లిపి ముఖానికి ప‌ట్టిస్తే.

మృత కణాలు పోవడంతోపాటు చర్మం కాంతివంతంగా మారుతుంది.

తాజా వార్తలు