తిరుమలగిరిలో హై టెన్షన్...!

సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి( Tirumalagiri ) పట్టణం బుధవారం పోలీసు వలయంలో చిక్కుకుంది.

పట్టణానికి నలుదిక్కులా పోలీసు పహారాతో ఎమర్జెన్సీని తలపించింది.

వివరాల్లోకి వెళితే.ఈ మధ్య కాలంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్( Gadari Kishore Kumar )తిరుమలగిరి పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో దళితబంధు( Dalitha Bandhu ) గురించి మాట్లాడుతూ ప్రతిపక్ష కార్యకర్తలకు, ఎమ్మార్పీఎస్ కొడుకులకు కూడా ఇచ్చానని నోరు జారిన విషయం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.

దాంతో అఖిలపక్ష నేతలు తిరుమలగిరి పట్టణంలో నిరసన సభ ఏర్పాటు చేశారు.ఆ సభకు హాజరై తిరిగి వస్తుండగా అడ్వకేట్ యుగంధర్ పై ఎమ్మెల్యే అనుచరులు దాడిచేసి,హత్యాయత్నానికి పాల్పడ్డారు.

దీనితో అసలే ఎమ్మెల్యే వైఖరిపై గుర్రుగా ఉన్న అఖిలపక్షాలకు అగ్నిని ఆజ్యం పోసినట్లుగా అడ్వకేట్ పై జరిగిన దాడి మరింత ఆగ్రహం తెప్పించింది.దీనిపై ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు,ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనాలు కొనసుగుతున్నాయి.

Advertisement

ఈ నేపథ్యంలో బుధవారం తిరుమలగిరి పటణంలో అఖిలపక్షాలు మహాధర్నాకు పిలుపునిచ్చాయి.ఇప్పటికే ఎమ్మెల్యే పొలిటికల్ ఇమేజ్ కి దెబ్బ తగలడంతో మరింత డ్యామేజ్ జరగకుండా పోలీసులతో మహాధర్నా జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఎమ్మేల్యే కనుసన్నల్లో పనిచేస్తున్న పోలీసులు అర్థరాత్రి నుండి అక్రమ అరెస్టుల పర్వానికి తెరతీశారు.బుధవారం ఉదయం మొత్తం తిరుమలగిరి పట్టణ నలుమూలల నుండి ఎవరూ లోనికి రాకుండా ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తూ,పోలీస్ స్టేషన్లకు తరలించడంతో తిరుమలగిరిలో టెన్షన్ నెలకొంది.

ఎమ్మెల్యే గాదరి కిశోర్ మాటలు విని అఖిలపక్ష నేతలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసుల తీరుపై వివిధ రాజకీయ,ప్రజా,కుల సంఘాల నేతలు మండిపడుతున్నారు.ఒక దళిత ఎమ్మెల్యేగా ఉండి,ఇక్కడి దళితులపై భౌతిక దాడులు చేయిస్తున్న గాదరి కిషోర్ కు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పడం ఖాయమని అంటున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్26, గురువారం 2024
Advertisement

Latest Suryapet News