గ్రంధాలయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత:మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: జిల్లా గ్రంధాలయ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయిస్తుందని,నిరుద్యోగ యువతకు మంచి పుస్తకాలతో పాటు, రుచికరమైన భోజనం వసతి కూడా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చెప్పారు.

జిల్లా గ్రంథాలయం ఆవరణలో కాంపిటేటివ్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న మహిళా అభ్యర్థులు చదువుకోవడానికి నిర్మాణం చేసిన అదనపు షెడ్ ను మంగళవారం విద్యా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పరీక్షలు,పోటి పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న యువతకు గ్రంధాలయం నందు మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు చేసిన మంత్రి జగదీష్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు.జిల్లా గ్రంథాలయం నందు ప్రతిరోజూ 200 మంది యువకులు,120 మంది మహిళలు పోటి పరీక్షలకు ప్రిపేర్ అవడానికి వస్తున్నారని తెలిపారు.

High Priority For The Development Of Libraries Minister Jagadish Reddy, Develop

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ,వైస్ చైర్మన్ పుట్ట కిషోర్,పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులు, కౌన్సిలర్ లు తహేర్ పాషా, నిమ్మల స్రవంతి,కో ఆప్షన్ సభ్యులు వెంపటి సురేష్, రియాజుద్దిన్,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు,ఉప్పల ఆనంద్,కక్కిరేణి నాగయ్య,కుంభం రాజేందర్,శభరినాధ్ , సయ్యద్ సలిం,జలీల్, ఇరుగు కోటీశ్వరి,కరుణశ్రీ, కల్లెపల్లి మహేశ్వరి, గ్రంధాలయ కార్యదర్శి కెవి సీతారామ శాస్త్రి, లైబ్రేరియన్ లు శ్యామ్ సుందర్ రెడ్డి,ఎమ్ వి రంగారావు,కె.విజయ భాస్కర్,పి.

సృజన తదితరులు పాల్గొన్నారు.

Advertisement
పింఛన్ల కోసం పొద్దంతా పడిగాపులు...!

Latest Suryapet News