తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో నటి శ్రద్ధ దాస్(Shraddha Das) ఒకరు.ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన మెయిన్ హీరోయిన్ గా చేయలేదు కానీ సెకండ్ హీరోయిన్ గా చేస్తూ వచ్చారు.
ఇలా సెకండ్ హీరోయిన్గా నటించిన ఈమెకు పెద్దగా అవకాశాలు మాత్రం రాలేకపోయాయి.ఇలా ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె ఇటీవల కాలంలో పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు.
ఈ విధంగా వెండితెర సినిమాలకు దూరంగా ఉన్నటువంటి శ్రద్ధాదాస్ బుల్లితెరపై కూడా సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే.బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ఢీ డాన్స్ షో( Dhee Dance Show ) కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
ఇక ఈమె హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఒక సినిమాలో నటించారు.అయితే ఆ సినిమాలో కూడా ఈమె సెకండ్ హీరోయిన్ గానే నటించారు.
తాజాగా ఈమె బాలీవుడ్ సినిమాలో నటించడం గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రద్ధాదాస్ జిద్ (Zid) అనే సినిమాలో నటించారు.ఈ సినిమాలో నటిస్తున్నటువంటి సమయంలో జరిగిన సంఘటనల గురించి శ్రద్ధ దాస్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాలో ప్రియాంక చోప్రా సోదరి మన్నారా చోప్రా( Mannara Chopra ) విలన్ గా నటించింది.
ఈమె బిగ్ బాస్ హిందీ లేటెస్ట్ సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచారు.
ఈ క్రమంలోనే శ్రద్ధాదాస్ మన్నారా చోప్రా గురించి పలు వ్యాఖ్యలు చేశారు.జిద్ సినిమాలో నటిస్తున్నటువంటి సమయంలో ఒక సన్నివేశంలో తను నన్ను మెట్ల పైనుంచి తోయాల్సి ఉంటుంది డైరెక్టర్ గారు అప్పటికే మెల్లిగా తోయాలి అని చెబుతున్నారు కానీ మన్నారా మాత్రం తన బలం అంతా ఉపయోగించి తోసేసిందని దాంతో తనకు తీవ్రమైన గాయాలు( Severe Injuries ) అయ్యాయని ఈమె తెలియచేశారు.అదేవిధంగా మరొక సన్నివేశంలో తను నన్ను చాతిపై కొట్టాల్సి ఉంటుంది.
ఈ సన్నివేశానికి ముందు కూడా నేను చాలా మెల్లిగా కొట్టండి అని చెప్పాను కానీ ఆమె నిజమైన కర్ర తీసుకొని తన బలం మొత్తం ఉపయోగించి నన్ను చితకబాదింది అంటూ శ్రద్ధాదాస్ తెలిపారు.ఆ దెబ్బకు నేను హాస్పిటల్ పాలయ్యానని కొంచెం ఉంటే కనుక కోమాలోకి వెళ్లిపోయే దానిని అంటూ డాక్టర్లు చెప్పారు అంటూ శ్రద్ధాదాస్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.