ప్రతి ఒక్క సినిమాలో హీరో, హీరోయిన్, విలన్ కచ్చితంగా ఉంటారు.సినిమా అంటేనే ఆ మూడు పాత్రలపై నడుస్తుంది.
ఈ మూడు పాత్రల మధ్య సినిమా కథ నడుస్తుంది.అలా సినిమా చివరి వరకు విలన్ కూడా ఉంటాడు.
చివరిలో విలన్ చనిపోతే.హీరో, హీరోయిన్ కలుస్తారు.
దాంతో సినిమా శుభం పలుకుతుంది.
ప్రతి సినిమా అలానే ఉంటుంది.
కానీ మధ్య మధ్యలో ట్విస్ట్ లు వేరేలా ఉంటాయి.దాంతో హీరోలు.
విలన్ ముందరే తిరుగుతూ వారిపై సైలెంట్ యుద్ధం చేస్తుంటారు.ఇలా హీరోకు, విలన్ కు మధ్యలో కొన్ని కొన్ని బేరాలు, ఒప్పందాలు, గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి.
ఇక సినిమాలలో ఐటెం సాంగ్స్ కూడా ఉంటాయన్న సంగతి మనకు తెలుసు.
ఆ ఐటెం సాంగులో హీరోయిన్ ఉండటం చాలా తక్కువ.
కేవలం హీరో, విలన్ మాత్రమే ఉంటారు.ఇక ట్విస్ట్ ఏంటంటే.
ఆ పార్టీ విలన్ ఇస్తే.హీరో వచ్చి ఐటెం బామతో చిందులు వేస్తాడు.
విలన్ ఒక దగ్గర కూర్చుని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.ఇలాంటి సన్నివేశాలు ప్రతి సినిమాలో జరుగుతూనే ఉంటాయి.
ఇక దీనిపై కూడా మీమర్స్ మీమ్స్ క్రియేట్ చేశారు.అందులో కొన్ని సినిమాలు ఉండగా అవేంటో తెలుసుకుందాం.
సర్ధార్ గబ్బర్ సింగ్:
పవన్ కళ్యాణ్, కాజల్ జంటగా నటించిన సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. ఇందులో పవన్ కళ్యాణ్ విలన్స్ ను ఒక రేంజ్ లో భయపెట్టిస్తాడు.ఇక ఇందులో విలన్స్ అందరూ పార్టీ చేసుకుంటూ ఉండగా అక్కడికి పవన్ వెళ్లి ఐటెం గర్ల్ తో స్టెప్పులేసి విలన్స్ కు మండిపోయేలా చేస్తాడు.
యమ దొంగ:
జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమా గురించి అందరికీ తెలిసిందే.ఈ సినిమా యముడు, మానవుడు మధ్య జరిగిన సంభాషణ నేపథ్యంలో తెరకెక్కింది.ఇక ఇందులో పై లోకంలో విలన్గా ఉన్న యముడు స్వర్గం నుంచి రంభ, ఊర్వశి, మేనకలను రప్పించి వారితో చిందులు వేయాలనుకుంటాడు.కానీ హీరో వచ్చి ఎంజాయ్ చేస్తాడు.
దూకుడు, పోకిరి:
మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాలో.మహేష్ బాబు విలన్ లను బాగా ఆడుకుంటాడు.ఇక వారితో బాగా ఆడుకుంటూనే.
వారు ఎంజాయ్ చేసే పార్టీలలో మహేష్ బాబు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తాడు.ఇక పోకిరి సినిమాలో కూడా అలాంటి సీనే ఉంటుంది.
పుష్ప:
ఇటీవలే ఇండియా లెవెల్ లో విడుదలైన పుష్ప సినిమా గురించి అందరికీ తెలిసిందే.ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటించగా సునీల్ విలన్ గా నటించాడు.ఇక విలన్ ఐటమ్ సాంగ్ తో పార్టీ ఇవ్వగా ఆ పార్టీలో అల్లు అర్జున్ సమంతతో చిందులేసి ప్రేక్షకులను తెగ ఎంజాయ్ చేసేలా చేశాడు.ఇలా ఐటమ్ సాంగ్ విషయంలో హీరో, విలన్ ల మధ్య వేరే లెవెల్ ఉంటుందని చెప్పవచ్చు.