జిడ్డు చ‌ర్మానికి స్వ‌స్థి ప‌ల‌కాలా? అయితే గ్రేప్ సీడ్ ఆయిల్ వాడాల్సిందే!

సాధార‌ణంగా అంద‌రి చ‌ర్మ త‌త్వాలు ఒకేలా ఉండ‌వు.కొంద‌రివి పొడిగా ఉంటే, కొంద‌ర‌వి జిడ్డుగా ఉంటాయి.

మ‌రికొంద‌రివి ఎంతో సున్నితంగా ఉంటాయి.అయితే మిగిలిన వాటితో పోలిస్తే జిడ్డు చ‌ర్మం క‌లిగిన వారే ఎక్కువ స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేస్తుంటారు.

చ‌ర్మంపై అధిక జిడ్డు కార‌ణంగా మొటిమ‌లు, మ‌చ్చ‌లు తీవ్రంగా ఇబ్బంది పెడ‌తాయి.మేక‌ప్ కూడా వేసుకున్న కొన్ని క్ష‌ణాల‌కే పోతుంటుంది.

అందుకే జిడ్డు చ‌ర్మాన్ని వ‌దిలించుకునేందుకు నానా పాట్లు పాడుతుంటారు.

Grapeseed Oil, Oily Skin, Benefits Of Grapeseed Oil, Grapeseed Oil For Skin, Sk
Advertisement
Grapeseed Oil, Oily Skin, Benefits Of Grapeseed Oil, Grapeseed Oil For Skin, Sk

అయితే జిడ్డు చ‌ర్మానికి స్వ‌స్థి ప‌ల‌కాల‌నుకునే వారికి గ్రేప్ సీడ్ ఆయిల్ బెస్ట్ అప్ష‌న్‌గా చెప్పుకో వ‌చ్చు.అవును, గ్రేప్ సీడ్ ఆయిల్‌లో ఉండే కొన్ని ప్ర‌త్యేక‌మైన పోష‌కాలు చ‌ర్మంపై జిడ్డు ఉత్ప‌త్తిని త‌గ్గించి ఫ్రెష్ లుక్‌ను అందిస్తాయి.మ‌రి ఇంకెందుకు లేటు స్కిన్‌కి గ్రేప్ సీడ్ ఆయిల్‌ను ఎలా వినియోగించాలో చూసేయండి.

ప్ర‌తి రోజు రాత్రి నిద్రించే ముందు ముఖానికి ఉన్న మేక‌ప్ మొత్తం తొల‌గించి వాట‌ర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత గ్రేప్ సీడ్ ఆయిల్‌ను డైరెక్ట్‌గా ముఖానికి అప్లై చేసి స్మూత్‌గా మ‌సాజ్ చేసుకోవాలి.

ఉద‌యాన్నే చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే గ‌నుక‌.

జిడ్డు చ‌ర్మానికి శాశ్వ‌తంగా బై బై చెప్ప‌వ‌చ్చు.

Grapeseed Oil, Oily Skin, Benefits Of Grapeseed Oil, Grapeseed Oil For Skin, Sk
సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?

అలాగే మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు, ముడ‌త‌లు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డే వారు.రోజూ వాడే మాయిశ్చ‌రైజ‌ర్‌లో గానీ, లోష‌న్‌లో గానీ, సీర‌మ్‌లో గానీ రెండు చ‌క్క‌లు గ్రేప్ సీడ్ ఆయిల్‌ను మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి అప్లై చేసుకోవాలి.

Advertisement

ఇలా రాత్రి ప‌డుకునే ముందు చేస్తే గ‌నుక ఆయా చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు తొల‌గి పోయి చ‌ర్మం మృదువుగా, కాంతి వంతంగా మ‌రియు య‌వ్వంగా మారుతుంది.

తాజా వార్తలు