ఘనంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలు...

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు జాతీయ జెండా యొక్క ప్రాముఖ్యత గురించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ హరినాథ్ రాజు మాట్లాడుతూ యావత్ భారతదేశం గౌరవించే జాతీయ జెండా( National flag )ను రూపొందించిన పింగళి వెంకయ్య( Pingali Venkayya ) ఒక తెలుగు వాడు కావడం మనం ఎంతో గర్వించదగ్గ విషయం అని అన్నారు.

ప్రతి ఒక్కరూ దేశం పట్ల భక్తి భావంతో మెలగాలని దేశభక్తి పెంపొందించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పదో తరగతి విద్యార్థినిలు పాఠశాల డైరెక్టర్లు తీపిరెడ్డి వెంకట్ రెడ్డి, పడాల సురేష్, ఎర్ర గంగానర్సయ్య ఉపాధ్యాయులు సునీల్ కుమార్ విజయ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.

హనుమాన్ భజన చేసి నిరసన తెలిపిన సిరిసిల్ల జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు

Latest Rajanna Sircilla News