సబ్ డివిజన్ పనులు ఇక్కడే జరిగేలా చూడండి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు వినతి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కు పంచాయతీ రాజ్ సబ్ డివిజన్( Panchayati Raj Sub Division ) మంజూరు అయి ఉందని ,కానీ సిరిసిల్ల కేంద్రముగా పంచాయతీ రాజ్ డిపార్ట్ మెంట్ అధికారులు పనులు చేస్తున్నారని దీంతో ఎల్లారెడ్డిపేట,వీర్నపల్లి, గంభీరావుపేట,ముస్తాబాద్ మండలాల కాంట్రాక్టర్, మాజీ సర్పంచ్ లు ఎం.

బి రికార్డు ల కోసం బిల్లుల కోసం వెళ్ళడం వల్ల వ్యయ ప్రయాసాల కు గురవుతున్నారని ఎల్లారెడ్డిపేటలోనే పంచాయతీ రాజ్ సబ్ డివిజన్ పనులు కొనసాగేట్టు చూడాలని ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్,యూత్ కాంగ్రెస్ మండల నాయకులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్ లు వేములవాడ లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ మేరకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతానని ఎల్లారెడ్డి పేటలో నే పంచాయతీ రాజ్ సబ్ డివిజన్ పనులు జరిగేలా చూస్తానని అన్నారు.

అనారోగ్య బాధితులకు ఆర్దికంగా అండ తక్షణమే సహాయం అందించిన జిల్లా కలెక్టర్

Latest Rajanna Sircilla News