అందరికీ నమస్కారాలు, నేను ఓ ప్రభుత్వ ఉపాద్యాయుడిని.ఈ రోజు నాలోని ఆవేదనను ఈ ఉత్తరం ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నారు.
ఈ మధ్య ఫేస్ బుక్ ఓపెన్ చేసిన ప్రతిసారీ ఉపాద్యాయులను కించపరుస్తూ కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి.అవేంటంటే.
గవర్నమెంట్ టీచర్స్ గా పనిచేస్తూ,,వేలకువేలు జీతాలు తీసుకుంటూ , పిల్లలకు సరిగ్గా పాఠాలు చెప్పరు.రిజల్ట్స్ లో కూడా చాలా వెనుకబడి ఉంటారు.
వీళ్లకు జీతాలే దండగ, ఓసారి ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ను చూసి బుద్ది తెచ్చుకోండి.మీతో పోల్చితే వాళ్లు చాలా బెటర్.
ఇలాంటి పోస్టులు నన్ను ఎంతగానో బాధపెట్టాయి.ఆ ప్రశ్నను లేవనెత్తిన వారికి, దానికి సపోర్ట్ గా లైక్స్, కామెంట్స్, షేర్స్ చేస్తున్న వారికి నాదొక చిన్న విన్నపం….
దీనిపై నా వర్షన్ మీకు వినిపిస్తా…తర్వాత మీరే బేరీజు వేసుకోండి…మా పట్ల మీ మాటలు సరైనవా? కాదా? అని.
రోజుకి 10-15 గంటలు కష్టపడి విపరీతమైన పోటీలో ఆంద్రా సివిల్స్ గా పిలవబడే D.S.C లో ఎంపికయ్యాం.మాకు teaching వృత్తికాదు passion…అసలు govt schools లో private schools లో ఏం జరుగుతుందో తెలుసామీకు? govt teachers కి టెలికాన్ఫరెన్స్ , వీడియోకాన్ఫరెన్స్ ,స్కూల్ కాంప్లెక్స్ మీటింగు , D.E.O మీటింగు , ఎయిడ్స్ ట్రైనింగ్ , పిల్లలడ్రెస్ , పాఠ్యపుస్తకాలు తేవడానికి ఒకరు ,ట్రెజరీ బిల్స్ చెయ్యడానికి మరొకరు , సైన్స్ ఫెయిర్ , ట్రైనింగులు ,midday meals వంటివన్నీ చెయ్యమని విద్యాబోధన జరగకుండ చేసేది ఎవరు ?ఈ మధ్యే ఇంకొకటి మొదలుపెట్టారు.staff అందరి details అర్జంటుగా పంపండి.
students details అర్జంటు,మార్క్స్ అర్జంటు….ఎన్నిసార్లు పంపినా అవన్నీ అవతల పడేసి మళ్ళీ అర్జంటుగా పంపండి అని అడుగుతారు.
అర్జంటుగా వాళ్ళడిగినవి ప్రిపేర్ చేస్తుండగా,,పిల్లలు కొట్టుకోవడమో తిట్టుకొవడమో చేస్తారు.మళ్ళీ దానికి బాధ్యులు టీచర్సే.
అప్పుడు సస్పెండ్ చెయ్యడానికి అధికారులు అర్జంటుగా వచ్చేస్తారు.
పిల్లవాడు బడిలో చేరేసరికి వాడికి ఆధార్ నంబర్ ఉండదు ఆ పాట్లు మావే.దానికీ class teacher నే బలి చేస్తారు,పిల్లల adhar nos D.E.O website లో upload చెయ్యాలి.అందుకు రాత్రి 10 , 11 అవ్వచ్చు…ఇంతలోనే 10th ,inter ,B.Ed,D.Ed examination duties వేస్తారు.
ఐనా సకాలంలో syllabus పూర్తిచేస్తాం,పిల్లలకి notes ఇస్తాం, వాటిని correction చేస్తాం.project works చేయించి,పరీక్షలు పెట్టి పేపర్లుదిద్ది ఆ మార్కులు నానా రకాల రికార్డ్లలో వేస్తాం.
ఇంతేకాక T.L.M ,Teacher diary,lesson plan.వంటివి రాయాలి.కాని ప్రైవేటు teacher పై ఇంత వత్తిడి ఉండదు.
వాళ్ళు just lessons చెప్పి వెళ్ళిపోతారు.పిల్లలకు printing meteerials ఇస్తారు.
పిల్లల్ని చదివించడానికి tuters ఉంటారు.class incharges, acadamic incharges ఉంటారు.
పిల్లలకు exams పెట్టేది ఒకరు , వాటిని దిద్దేది మరొకరు , ఆ మార్క్స్ records lo వేసేది మరొకరు.కాని ఇక్కడ అవన్నీ మేమే చేసుకోవాలి.
ఇవన్నీ చాలవన్నట్టు ఈ దేశంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే got teacher కావాలి.ఖచ్చితమైన జనాభాలెక్కలు కావాలంటే govt teacher కావాలి.
private teacher కి ఇచ్చిన స్వేఛ్ఛ మాకిచ్చి చూడండి,govt school లో సీటు కావాలంటే M.L.A నో M.P నో రికమండ్ చేసే స్తాయికి govt schools ని తీసుకువెల్తాం.చట్టాల బలంతో ప్రజలు, అధికార బలంతో అధికారులు మాపై విరుచుకు పడుతున్నా ,, మాకు తెలిసిందల్లా తలదించుకుని భావి తరం తలెత్తుకుని జీవించడానికి విధ్యార్ఢి సర్వతోముఖాభివృద్ది సాధించడానికి కృషిచెయ్యడం.
ఇదంతా చదివాక కూడా మమ్మల్ని విమర్శించాలని అనుకుంటే మీ ఇష్టం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy