ఎక్కడైనా బావే కానీ వంగతోట దగ్గర కాదు అనే సామెత నానుడి ప్రస్తుత రాజకీయాల్లో సరిగ్గా సరిపోతుంది.ఏ పార్టీలో ఎవరు చేరినా .
ఎవరిని ఏ పార్టీ చేర్చుకున్న అదంతా రాజకీయ లబ్ది కోసమే.ఇక కాపు ఉద్యమ నేతగా వైసీపీ సానుభూతి పరుడిగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇప్పుడు రాజకీయ పార్టీలకు కావాల్సిన వ్యక్తిగా మారిపోయాడు.
ఆయన రాక కోసం పార్టీలన్నీ రెడ్ కార్పెట్ వేసుకుని కూర్చున్నాయి.అయితే ఆయన మాత్రం తనకు ఏ పార్టీ కలిసొస్తుంది .నేను పెట్టే షరతులను ఏ పార్టీ తీరిస్తే ఆ పార్టీలోకి వెళదాం అనే ఆలోచనతో ఉండిపోయాడు.
ఒక దశలో ముద్రగడ జగన్ ముందు గట్టి బేరం పెట్టాడని.ముప్పై సీట్లను తన ఖాతాలోకి వదలాలని, తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరాడని వార్తలు వచ్చాయి.అయితే ఆ బాధ్యతను జగన్ బొత్స సత్యనారాయణకు ఇచ్చాడట.
దీంతో బొత్స అంతిమంగా మూడు సీట్ల ను ముద్రగడకు ఇవ్వాలని సూచించాడట.దీంతో ముద్రగడకు కోపం వచ్చేసింది.
దీంతో ఆయన జగన్ మీద విరుచుకుపడ్డాడని ఆ కోపంతోనే ఆయన జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధం అయ్యాడని తెలుస్తోంది.
ఇప్పుడు గోదావరి జిల్లాల్లో జనసేన హడావుడి బాగా కనిపిస్తోంది.
అక్కడ కాపులు ప్రభావం ఎక్కువ ఈ నేపథ్యంలో జనసేన ప్రభావం కూడా అక్కడే ఉంటుందని అంతా అంటున్నారు.అందుకు తగ్గట్టుగా గోదావరి జిల్లాలకు చెందిన కాపు నేతలు జనసేన వైపు వెళ్తూ ఉన్నారు.
టీడీపీ, వైకాపాల్లో తమకు ఛాన్స్ దక్కదనే స్పష్టత కలిగిన వాళ్లు జనసేన వైపు చూస్తున్నారు.అటు వైపు చేరుతున్నారు.
ఇలాంటి వాళ్లంతా కాపు సామాజికవర్గం వాళ్లే కావడంతో జనసేన పూర్తిగా కాపుల పార్టీ అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోతోంది.ముద్రగడ కూడా పవన్ కు తన డిమాండ్ ల చిట్టా అందించాడని ఆయన నుంచి సానుకూల స్పందన వస్తే చేరిక ఖాయమే అని ముద్రగడ అనుచరులు మీడియా కు లీకులు ఇస్తున్నారు.అయితే కాపు నాయకుడైన ముద్రగడ జనసేనలో చేరితే ఆ పార్టీ పూర్తిస్థాయి కాపు పార్టీగా ముద్ర వేయించుకుంటుంది.ఈ పరిణామం జనసేనకు పెద్దగా కలిసిరాకపోవచ్చు.