షూటింగ్ స్పాట్ నుండి హీరోయిన్ జంప్..! ఎందుకో తెలుసా.? ఇంతకీ ఎవరా హీరోయిన్.?

సీరియస్ గా షూటింగ్ జరుగుతోంది.షాట్ గ్యాప్ వచ్చింది.

 Anupama Prakash Runs Away From The Shooting Spot-TeluguStop.com

కాసేపటికి.షూటింగ్ స్టార్ట్ చేశారు.

హీరోయిన్ కోసం అడిగితే.చూడలేదన్నారు.

కాసేపటికి నిర్మాతకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా హీరోయిన్ మిస్ అయ్యిందన్న వార్తతో పోలీసు స్టేషన్ కుపరుగులు పెట్టిన పరిస్థితి కోలీవుడ్ లో చోటుచేసుకుంది.

సంచలనం సృష్టించిన ఈ సంఘటన కొడైకెనాల్ లో జరిగింది .ఇంతకీ షూటింగ్ నుండి పారిపోయిన హీరోయిన్ ఎవరో తెలుసా …….అనుపమా ప్రకాష్ .అవళుక్కెన్న అళగియ ముగం పేరుతో తెరకెక్కుతున్న తమిళ చిత్రంలో నటిస్తోంది అనుపమా ప్రకాష్ .

హీరోయిన్ అనుపమ ప్రకాష్ విరామం మధ్యలో తన రూముకు వెళ్లింది.మళ్లీ షూటింగ్ మొదలు పెట్టే సమయానికి కనిపించకుండా పోయింది.దీంతో కంగారు పడ్డ యూనిట్ సభ్యులు ఆరా తీయగా తన స్వస్థలం ఢిల్లీ వెళ్లిపోయినట్లు తెలుసుకున్నారు.

నిర్మాత స్వయంగా వెళ్లి విషయం అడగ్గా ఎత్తైన కొండల నడుమ డాన్స్ చేయడంతో భయంగా అనిపించిందని అందుకే వచ్చేసానని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.పాటను కంప్లీట్ చేసే నిమిత్తంగా మళ్లీ ఆమెను తీసుకువచ్చి మిగిలిన భాగాన్ని చిత్రీకరించారు చిత్ర యూనిట్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube