తెలుగు టెలివిజన్ లో యాంకర్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి ప్రదీప్.ఆర్జేగా కెరియర్ ప్రారంభించి తరువాత యాంకర్ గా మారిన ప్రదీప్ ప్రస్తుతం టెలివిజన్ షోలలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న యాంకర్ గా ఉన్నాడు.
తన స్టైల్, మేనరిజమ్స్ తో యాంకరింగ్ కి ఎనర్జీ తీసుకొచ్చిన ప్రదీప్ మరో వైపు నటుడుగా కూడా తనని తాను ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నాడు.ప్రస్తుతం ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజులలో ప్రేమించడం ఎలా సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది.
గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకొచ్చాయి.ఇదిలా ఉంటే యాంకర్ ప్రదీప్ కెరియర్ లో బాగా రిమార్క్ తీసుకొచ్చిన షో అంటే పెళ్లి చూపులు అని చెప్పాలి.
ఈ షో కారణంగా అతని ఇమేజ్ కొంత వరకు డ్యామేజ్ అయ్యింది.కొంత మంది మహిళా సంఘాలు ఈ షోపై కేసులు కూడా పెట్టారు.
అయితే ఈ షోలో విన్నర్ గా నిలిచి ప్రదీప్ ని మెప్పించిన అమ్మాయిగా జ్ఞానేశ్వరి నిలిచింది.ఈ భామ ఈ షోలో పాల్గొనడానికి ముందే షార్ట్ ఫిలిమ్స్ లో నటిగా ఎంట్రీ ఇచ్చింది.
ఈ షో తర్వాత కూడా నటిగా కెరియర్ ఎంచుకుంది.ప్రస్తుతం మిస్టర్ అండ్ మిస్సెస్ అనే క్రౌడ్ ఫండింగ్ మూవీలో హీరోయిన్ గా నటించింది.
ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కి రెడీ అవుతుంది.ఈ సందర్భంగా ఆమె మీడియా ఇంటర్వ్యూలో తన సినిమా కెరియర్ గురించి చెప్పడంతోపాటు పెళ్లి చూపులు షో గురించి కూడా క్లారిటీ ఇచ్చింది.
పెళ్లి చూపులు షో అనేది నిజానికి ప్రదీప్ ని పెళ్లి చేసుకోవడం గురించి కాదని, కేవలం పెళ్లిచూపులు మాత్రమే అని, ఒకరికొకరు అర్థం చేసుకుంటే చేసుకోవచ్చని అప్పట్లో చెప్పారని ఙ్ఞానేశ్వరి తెలిపింది.అయితే మరి ప్రదీప్ తో ప్రయాణం, పెళ్లి గురించి మాత్రం ఆమె ఎలాంటి విషయాలు బయటపెట్టలేదు.
.