సదరం సర్టిఫికెట్ ఇప్పించండి సారూ...!

సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూర్ గ్రామానికి చెందిన నిరుపేద వికలాంగురాలు రేసు రామనర్సమ్మ తనకు 90 శాతం అంగవైకల్యం ఉన్నా సదరం సర్టిఫికేట్ అందడం లేదని వాపోయింది.

గతంలో తనకు బోదకాలు ఉన్నప్పుడు సదరం సర్టిఫికెట్ కొరకు మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నానని,డాక్టర్లు పరిశీలించి 27% అంగవైకల్యం ఉందని నిర్ధారణ చేశారన్నారు.

కొద్ది రోజుల తర్వాత బోధకాలుకు వరంగల్ లోని ఎంజీఎం ప్రభుత్వ హాస్పిటల్లో శస్త్రచికిత్స చేసి మోకాలు కింది వరకు తొలగించారని,ప్రభుత్వ పథకాల కొరకు దరఖాస్తు చేసుకోవడం కోసం మీ సేవ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేద్దామంటే గతంలో దరఖాస్తు చేసుకున్నందున కొత్తగా దరఖాస్తు కావడం లేదని,కలెక్టరేట్ జరిగే ప్రజావాణి కార్యక్రమంలో ధరఖాస్తు ఇచ్చినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లను సంప్రదించినా, ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సదరం సర్టిఫికెట్ మాత్రం ఇవ్వడం లేదని,నిరుపేదనైన తన జీవనం ఇబ్బందిగా మారిందని,ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సదరం సర్టిఫికేట్ ఇప్పిస్తే ప్రభుత్వం ద్వారా వచ్చే పింఛన్ తో బ్రతుకుతానని వేడుకుంది.

Give All Certificates Sir , Certificates , Apur, MGM Govt Hospital-సదరం

Latest Suryapet News