ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం

సూర్యాపేట జిల్లా:అమాయకులే టార్గెట్ గా ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి మోసం చేస్తూ అడ్డంగా బుక్ అయిన ఘరానా మోసగాళ్ల బండారం మంగళవారం వెలుగుచూసింది.

దానికి సంబంధించిన ఓ ఫోన్ కాల్ వాయిస్ రికార్డ్ జిల్లా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కేంద్రంగా చేసుకుని దందాకు పాల్పడుతున్న ముఠా రాకెట్.జిల్లాలోని హుజూర్ నగర్ లో ఈఎస్ఐ హాస్పిటల్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు వలవేస్తున్న కేటుగాళ్ల బండారం ఆ ఆడియో ద్వారా బట్టబయలు అయ్యింది.

మొత్తం ఖాళీల సంఖ్య 18 ఉండడంతో ఒక్కో ఉద్యోగానికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి వసూళ్ల పర్వానికి తెరలేపారు.సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యాగాలకు 3.50 లక్షలు, ఏఎన్ఎం ఉద్యోగం కావాలంటే 2.50 లక్షలు, అటెండర్ ఉద్యోగం కావాలంటే 2.50 లక్షలుగా ధర నిర్ణయించారు.ఇవి కాకుండా డాక్యుమెంట్ ఫీజు రూ.25,000 లు అదనంగా సమర్పించాలట.మొదటగా మొత్తం చెల్లించిన వారికే ఉద్యోగాలు ఇస్తామని ఆలస్యం చేసే ఆశాభంగం మంచి తరుణం మించినా దొరకదని ఉదరగొడుతూ అమాయకుల ఉసురు తీస్తున్నారు.

అసలు టెండర్లు లేకుండా నామినేషన్ ద్వారా మంజూరు చేసిన కాంట్రాక్టు హైకోర్టులో ఎలా నిలబడుతుందనేది నిరుద్యోగులు అర్థం చేసుకోవాలి.రాష్ట్ర హాం శాఖా మంత్రి పేరు చెప్పుకుంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

Advertisement
కార్పొరేట్ హెయిర్ సెలూన్స్ అడ్డుకోండి

Latest Suryapet News