ఇండస్ట్రీలో వెలుగులు కరువయ్యాయి.. అన్ని రొట్టకొట్టుడు కథలే?

ఒకప్పుడు క్రేజీ కంటెంట్కు ఆ చిత్ర పరిశ్రమ కేరాఫ్ అడ్రస్.అంతే కాదు టాలెంట్ ఉన్న దర్శక నిర్మాతలకు ఆ చిత్ర పరిశ్రమ ఒక చిరునామా.

 Routine Story Movies Troubling The Kollywood Industry Details, Routine Story Mov-TeluguStop.com

ఇక సూపర్ స్టార్ లు లోకల్ నాయకులు వచ్చింది కూడా అక్కడి నుంచే.వాళ్ళు తీసిన సినిమాలు చూస్తూ ఉంటే ఇలాంటి సినిమాలు ఎలా తీశారు అబ్బా అని అందరూ ఆలోచనలో పడిపోయేవారు.

కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారిపోయాయి.ఆ ఇండస్ట్రీలో కొత్తదనమే కరువైపోయింది.

తెలుగు మలయాళ కన్నడ ఫిలిం ఇండస్ట్రీలు నేషనల్ వైడ్ గా గుర్తింపు సంపాదించుకుంటే కోలీవుడ్ మాత్రం అక్కడే ఆగిపోయింది.ఇక్కడ హీరోలు తీస్తున్న సినిమాలతో ఇక తమిళ ఆడియన్స్ చిరాకు పడుతున్నారు అని చెప్పాలి.

రోజా, భారతీయుడు, బొంబాయి నరసింహ, ప్రేమదేశం, గజినీ అపరిచితుడు రోబో ఇలా చెప్పుకుంటూ పోతే అని పాన్ ఇండియా లెవెల్ సినిమాలే.అన్ని సూపర్ హిట్ కూడా అయినవే.

కానీ ఇదంతా గతం ప్రస్తుతం మాత్రం అలాంటివి కూడా ఎక్కడా కనిపించడం లేదు.మన వాళ్ళు సైతం తమిళ కంటెంట్ని ఇష్టపడటం లేదు.

ఇప్పుడు అక్కడి సినిమాలను అసలు చూసేవారు కూడా కరువై పోతున్నారు అని చెప్పాలి.సూర్య లాంటి వాళ్ళ అప్పుడప్పుడూ కొన్ని ప్రయోగాలతో మెప్పించిన కమర్షియల్ హిట్ మాత్రం అందుకోలేక పోతున్నారు.

Telugu Beast, Et, Ajith, Surya, Yash, Kgf Chapter, Kollywood, Routine Story, Tol

గేమ్ చేంజ్ చేసే డైరెక్టర్లు కొత్త ట్రెండ్ క్రియేట్ చేసే డైరెక్టర్లు తమిళ్ లో కరువయ్యారు అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న మాట.ఇక అవే రొడ్కొట్టుడు కథలతో అజిత్, విజయ్ ఇలాంటి హీరోలు వస్తున్నా చివరికి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడిపోతున్నారు.

మంచి కమర్షియల్ గా కనిపించాలి ఇక హీరోయిజం ఎలివేట్ అవ్వాలి అనే రొడ్డకొట్టుడు కథలు తప్ప కాస్త ప్రయోగాలు చేయాలి కథలో కొత్తదనం ఉండాలి అని ఎవరూ ఆలోచించడం లేదు.కథ కొత్తగా ఉంటే దానికి డైరెక్టర్ టేకింగ్ తోడైతే ఎలా ఉంటుందో అన్నది కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా నిరూపించింది.

Telugu Beast, Et, Ajith, Surya, Yash, Kgf Chapter, Kollywood, Routine Story, Tol

ఒక సాదాసీదా హీరో లాంటి యష్ కే జి ఎఫ్ తో బ్లాక్ బస్టర్ కొడితే ఇప్పటికే బ్లాక్బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరోలు మాత్రం అసలు హిట్ కొట్టడానికి ఎంతో కష్టపడి పోతున్నారు.ఉన్న కథలనే అటు ఇటూ మార్చి తీస్తున్నారు.ఏదేమైనా తమిళ ఇండస్ట్రీలో ఒకప్పటి వెలుగులు మాత్రం కనిపించకుండా పోయాయి అన్నది ప్రస్తుతం సినీ విశ్లేషకులు చెబుతున్న మాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube