అవిసె గింజలను ఇలా తీసుకుంటే అధిక బ‌రువు దూరం?

నేటి కాలంలో చాలా మందికి అధిక బ‌రువు స‌మ‌స్య పెద్ద శాపంగా మారింది.ఈ అధిక బ‌రువును నిర్ల‌క్ష్యం చేస్తే.

మ‌ధుమేహం, హార్ట్ ఎటాక్‌, ర‌క్త పోటు, శ్వాస సమస్యలు ఇలాంటి జ‌బ్బులు కూడా చుట్టేస్తుంటాయి.అందుకే బ‌రువును త‌గ్గించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

డైటింగ్‌లు, వ్యాయామాలు ఇలా ఎన్నో చేస్తుంటారు.అయితే అధిక బ‌రువును త‌గ్గించ‌డంలో కొన్ని కొన్ని ఆహారాలు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

అందులో అవిసె గింజ‌ల‌ది ప్ర‌త్యేక స్థానం.అవిసె గింజ‌ల‌నే ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు.

Advertisement
Flaxseeds Help To Reduce Over Weight, Flaxseeds, Reduce Over Weight, Weight Loss

అవిసె గింజ‌ల్లో విట‌మిన్స్‌, ప్రోటీన్స్‌, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైబ‌ర్‌, ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలా ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.అటువంటి అవిసె గింజ‌ల‌ను డైట్‌లో చేర్చుకుంటే.

అధిక బ‌రువును దూరం చేసుకోవ‌చ్చు.అయితే అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలి అన్న‌ది కూడా చాలా ముఖ్యం.

ఎందుకంటే, డైరెక్ట్‌గా వాటిని తీసుకోవ‌డం చాలా కష్టం.అవి అరగవు మ‌రియు వాటి పోషకాలని శరీరం గ్రహించుకోలేదు.

Flaxseeds Help To Reduce Over Weight, Flaxseeds, Reduce Over Weight, Weight Loss

మ‌రి అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.అవిసె గింజలను నానబెడితే మొలకలు వస్తాయి.ఈ మొలకలు ఉదయాన్నే తింటే అవిసె గింజలల్లో ఉండే పూర్తిస్థాయి పోషకాలు మనకు అందుతాయి.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

అలాగే అందులో పుష్క‌లంగా ఉండే ఫైబ‌ర్‌ఎక్కువ స‌మ‌యం పాటు క‌డుపు నిండిన భావ‌న‌ను క‌లిగిస్తుంది.దాంతో ఇత‌ర ఆహారాలు తీసుకోలేరు.ఫ‌లితంగా బరువు త‌గ్గుతారు.

Advertisement

అలాగే అవిసె గింజల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి పొద్దున్నే ఆ నీటిలో కొద్దిగా నిమ్మ రసం కలుపుకుని తాగాలి.ఈ డ్రింక్‌లో చాలా త‌క్కువ కేల‌రీలు ఉంటాయి.

మ‌రియు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.రెగ్యుల‌ర్‌గా ఈ డ్రింక్ తాగినా బ‌రువు త‌గ్గుతాయి.

ఇక అవిసె గింజల పొడి ని నీటిలో కలిపి తీసుకున్నా ఫ‌లితం ఉంటుంది.

తాజా వార్తలు