శివుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలిసిన విషయమే.ఈయనకు వివిధ రకాల పదార్థాలతో అభిషేకం చేయటం వల్ల ఎంతో ప్రీతి చెంది ఆయన కరుణాకటాక్షాలు మనపై ఉంటాయని ప్రతి ఒక్కరు భావిస్తారు.
ఈ క్రమంలోనే శివుడికి వివిధ రకాల పదార్థాలతో అభిషేకాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు.అయితే ఈ విధంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించి పూజలు చేసిన స్వామివారికి ఎంతో ప్రీతికరమైన వాటితో అభిషేకం నిర్వహించి పూజ చేస్తే సకల సంపదలు కలుగుతాయని సర్వ దోషాలు తొలగి పోతాయని పండితులు చెబుతున్నారు.
ఇలా స్వామి వారికి ఎంతో ఇష్టమైన ఉమ్మెత్త పువ్వుతో అభిషేకం చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ప్రదోష కాలంలో స్వామివారికి అభిషేకం నిర్వహించి పూలమాలతో పూజ చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా మన జాతకంలో ఉన్న సర్వ దోషాలు తొలగి పోతాయి.
ప్రతి నెలలో ఈ ప్రదోషకాలం రెండు రోజులు వస్తుంది.ఒకటి అమావాస్యకు ముందు రోజు రాగా, మరొకటి పౌర్ణమికి ముందు రోజు వస్తుంది.
ఇలా ఈ ప్రదోషకాలంలో సకల దేవతలు కూడా పరమేశ్వరుడిని పూజిస్తూ ఉంటారని అలాంటి సమయంలో మనం పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఉమ్మెత్త పువ్వులతో పూజ చేయడం వల్ల సకల దేవతల ఆశీర్వాదం మనపై ఉండటం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు.ముఖ్యంగా కుజదోషంతో బాధపడేవారికి ఈ ప్రదోషకాలం ఎంతో ముఖ్యమైనది అని చెప్పవచ్చు.కుజదోషంతో బాధపడేవారు ప్రదోషకాలంలో స్వామివారికి ఉమ్మెత్త పువ్వులను సమర్పించి పూజ చేసిన అనంతరం దోష విముక్తి కలుగుతుంది.అయితే ఉమ్మెత్త పువ్వుతో శివయ్యను పూజించడానికి ముందు వినాయకుడికి పూజ చేయడం శుభకరం.