వైరల్: అలాచేస్తే మొసలికి కూడా సుఖంగానే ఉంటుంది మరి!

సుఖం ఎవరికక్కర్లేదు.మనిషికైనా, జంతువులకైనా, పక్షులకైనా, ఈ భూప్రపంచంలో జీవించే మిగతా ఏ జీవులకైనా 2 విషయాలు షేమ్ టు షేమ్ ఉంటాయి.

 Viral Video Alligator Reaction While Getting Scrubbed By Care Taker Details, Cro-TeluguStop.com

ఒకటి ఆహారం, రెండు సుఖం… సుఖం అనేది ఎన్నో రకాలు.ఎదుటివారి ప్రేరణ వలన వచ్చే సుఖం ఎన్ని కోట్లు పెట్టిన దొరకదనే చెప్పుకోవాలి.

మన పాట్నర్ మన జుట్టులోకి వేలి పోనిచ్చి అలా అలా నిమురుతుంటే ఆ సుఖాన్ని మాటల్లో వర్ణించలేం.ఎంతో హాయిగా ఉంటుంది.

అలాగే బార్బర్ షాప్ కి పోయి, తైల మర్దనా చేసినపుడు ఉంటుంది చూడండి… న భూతొ న భవిష్యతి.ఇక్కడ అచ్చంగా అలాంటి ఘటనే జరిగింది.

అయితే మనుషుల్లో కాదు సుమీ! మొసలికి జరిగింది.

అదేంటి! మొసలి తల ఎవరు నిమిరారు అని అనుకుంటున్నారా? మరెవరు, మనిషే నిమిరాడు.మరి వాడికి భయం లేదా?? అనే ఆలోచన కలుగుతోంది కదా.ఆగండాగండి, అక్కడికే వస్తున్నా.అసలు విషయంలోకి వెళితే, ఓ మొసలి అక్వేరియంలో కేర్‌టేక‌ర్ ఓ తెల్ల‌ని మొస‌లి వీపు రుద్దుతుండ‌గా ఓ సంతోష‌క‌ర‌మైన ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చింది.ఈ వీడియో నెటిజ‌న్ల మ‌న‌సుని విపరీతంగా దోచుకుంది.

ఈ వీడియోను ‘గేట‌ర్స్ డెయిలీ’ అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు.అమెరికాలోని నార్త్ క‌రోలినా అక్వేరియంలో లూనా అనే అల్బినో అలిగేట‌ర్ ఉంది.

వాటిని కేర్‌టేక‌ర్స్ ప్ర‌తిరోజూ క్లీన్ చేస్తుంటారు.ఇందులోభాగంగా కేర్‌టేక‌ర్ స్క్ర‌బ్‌తో మొస‌లి వీపుపై రుద్దింది.

సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తరువాత ఎక్కువగా ఇలాంటి ఫన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.అవును… ఇపుడు పులులు,సింహాలు, మొసళ్లు, పాములకు సంబంధించిన వీడియోలు మంచి ట్రెండింగ్ లో వున్నాయి.తాజాగా ఈ లిస్టులోకి చేరిపోయింది ఈ వీడియో.

మొసలి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కాగా ఇప్ప‌టివ‌ర‌కూ సదరు వీడియోని 2.7ల‌క్ష‌ల మంది వీక్షించడం కొసమెరుపు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube