రిపబ్లిక్ డే కానుకగా 'ఏజెంట్' నుండి అప్డేట్.. ఏంటంటే?

అక్కినేని నాగార్జున వారసుడిగా వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు అఖిల్ అక్కినేని.

అయితే అఖిల్ హీరోగా వచ్చిన తర్వాత ఈయనకు సూపర్ హిట్ అనేది చాలా రోజుల వరకు రాలేదు.

ఈయన గత సినిమా బ్యాచిలర్ తో మంచి హిట్ అయితే తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేసాడు.

ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలెట్టాడో తెలియదు కానీ వరుసగా వాయిదా పడుతూ వస్తుంది.కరోనా కారణంగా ఈ సినిమా షూట్ చాలా రోజులు ఆగిపోయింది.

దీంతో ఈ సినిమా షూట్ రెండుళ్లు అవుతున్న పూర్తి కాలేదు.ఇక ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా షూట్ జరుగుతుంది.

Advertisement

యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇంత వరకు అయితే బజ్ క్రియేట్ అవ్వలేదు.

ఏజెంట్ సినిమాను సురేందర్ 2 సినిమాస్ తో కలిసి ఏకే ఎంటెర్టాన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఇక ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించ నుండగా.ఈయనకు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే కీలక పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు.అలాగే హిప్ హప్ తమిళ్ సంగీతాన్ని అందిస్తుండగా రసూల్ ఫొటోగ్రఫీ అందిస్తున్నారు.

ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం అక్కినేని ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు.ఆగష్టు నుండి ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తుంది.ఇటీవలే ఫస్ట్ లుక్ టీజర్ అందరిని ఎంతో ఆకట్టుకుని మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

మరి తాజాగా అందుతున్న బజ్ ప్రకారం ఈ సినిమా రిలీజ్ డేట్ ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న మేకర్స్ అనౌన్స్ చేయనున్నట్టు టాక్.మరి ఇదే నిజమైతే అక్కినేని ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ అయితే ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు