దేశీయ మార్కెట్ లోనే అతి చిన్న ఎలక్ట్రిక్ కారు.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే..!

ప్రముఖ బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్( MG Motor ) దేశీయ మార్కెట్ లోనే అతి చిన్న ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారును( MG Comet electric car ) స్మార్ట్ కంపాక్ట్ మోడల్ లో మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది.ఈ కారు చూడడానికి చాలా చిన్నగా ఉన్న ఫీచర్స్ మాత్రం అద్భుతం.

 The Smallest Electric Car In The Domestic Market ,smallest Electric Car ,domesti-TeluguStop.com

ఎంజీ మోటార్ కంపెనీ భారత దేశంలో ప్రత్యేకమైన ప్లాంట్ ఏర్పాటు చేసి, కార్ల ఉత్పత్తిని ప్రారంభించింది.ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన జీఎస్ఈవీ ప్లాట్ ఫారం ఆధారంగా, సాలిడ్ స్టీల్ ఛాసిస్ పై సామర్థ్యం కలిగిన బాడీతో ఈ కారును ప్రత్యేకంగా తయారు చేసింది.

గుజరాత్ లోని హలోల్ ప్లాంట్( Halol plant Gujarat ) నుంచి ఈవీ కామెట్ ఉత్పత్తి సంస్థ దీనిని తొలిసారి ప్రదర్శించింది.ఏప్రిల్ 19న ఇండియాలో దీన్ని ఆవిష్కరించనుంది.ఈ కొత్త కారు ధరలపై కంపెనీ ఎటువంటి వివరాలు ప్రకటించలేదు.రాబోయే రెండు నెలలలో కామెట్ ఈవీ కారు ధరలు ప్రకటించే అవకాశం ఉంది.భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈ కామెట్ ఈవీ ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.అంతేకాకుండా నీల్సన్ నిర్వహించిన అర్బన్ మొబిలిటీ హ్యాపీనెస్ సర్వే ప్రకారం నగరాలలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు.

ఈ కామెట్ ఈవీ కారు ఫీచర్ల విషయానికి వస్తే డ్యూయల్ 10.25 అంగుళాల డిజిటల్ స్క్రీన్, స్టీరింగ్ వీల్ డిజైన్ తో పాటు డాష్ బోర్డు, ఇన్ఫో టైన్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్యాబిన్ లో బాక్సి డిజైన్ ఎల్ఈడి హెడ్ లైట్లు, టెయిల్ లైట్లు, యాంబియంట్ లైటింగ్, 17.3 kwh బ్యాటరీ, కామెట్ ఇంటర్నెట్ ఆఫ్ వెహికల్స్ మల్టీమీడియా, కనెక్టెడ్ ఫీచర్లతో సహా మార్కెట్లోకి వస్తున్నట్లు కంపెనీ తెలిపింది.అయితే దీని ధర దాదాపు రూ.10 లక్షల నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఈ కారు ధరను త్వరలోనే వెల్లడిస్తామని కంపెనీ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube