విద్యుత్ షాక్ తో రైతు మృతి

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం( Neredcherla manda ) ముకుందాపురం గ్రామానికి చెందిన రైతు పొలంలో విద్యుత్ షాక్ కి గురై మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నేరేడుచర్ల ఎస్ఐ పరమేష్ తెలిపిన వివరాలు ప్రకారం.

ముకుందాపురం గ్రామానికి చెందిన గజనబోయిన సైదులు గౌడ్(39) శుక్రవారం మధ్యాహ్నం కల్లూరు రెవిన్యూ పరిధిలోని పొలం కరిగట్టు నిర్వహిస్తున్న క్రమంలో విద్యుత్ మోటార్( Electric motor ) స్టార్టర్ వైర్ తగిలి కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కూతురి వివాహం కాగా, కుమారుడు 10వ,తరగతి చదువుతున్నాడు.జరిగిన ఘటనపై భార్య సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Advertisement

Latest Suryapet News