మానాల పంచాయతీ పాలకవర్గానికి ఘనంగా వీడ్కోలు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) రుద్రంగి మండలం మానాల గ్రామపంచాయతీ పాలకవర్గం పదవి కాలం ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మానాల ఇంచార్జి స్పెషల్ ఆఫీసర్ గా ఎంపీఓ సుధాకర్( MPO Sudhakar ) బాధ్యతలు స్వీకరించారు,అనంతరం సర్పంచ్,వార్డు సభ్యులకు ఆత్మీయ వీడ్కోలు సన్మాన సమావేశం ఏర్పాటు చేశారు.

పంచాయతీ కార్యదర్శి బాబు అధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఆత్మీయ సన్మాన సభకు వైస్ ఎంపీపీ పీసరి భూమయ్య, విడిసి చెర్మెన్ కొమ్ముల రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ అల్లూరి మనసా( Alluri Manasa ) తిరుపతి గత ఐదు సంవత్సరాలుగా పాలకవర్గం సహకారంతో, అన్ని వర్గాల సమన్వయంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు.ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని ఆమె సేవలు కొనియాడారు.

అంతేగాక వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలందరూ చైతన్యంతో అభివృద్దికి తోడ్పడడం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కంటే అభివృద్ధి లో ముందు వరుసలో ఉంచిందన్నారు.ఇదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల్లో కూడా నిజాయితీగా, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే వారిని పాలకవర్గ సభ్యులు ఎన్నుకోవాలని వారు కోరారు.

అనంతరం సర్పంచి అల్లూరి మనసా, ఉప సర్పంచ్ సర్పంచ్ చందా రాజేశం మరియు వార్డు సభ్యులందరికీ వైస్ ఎంపీపీ, విడిసి చేర్మెన్ తో పాటు గ్రామస్తులందరూ పూలమాలతో సత్కరించి, శాలువతో ఘనంగా సన్మానించారు.ఈ సన్మాన కార్యక్రమంలో కారోబార్ గుగులోత్ తిరుపతి, వార్డు సభ్యులు దర్శనపు జెలందర్, దండిగపు మల్లేష్, కంటల మారుతి,తూమ్ రమేష్, గోపిడి లింగారెడ్డి,లకవత్ జయరాం,దాసరి లక్ష్మీ, నాయిని సౌందర్య, బుర్ర సుజాత,సిద్దపెళ్లి గంగు,బాధనవేని రాజవ్వ,దేగవత్ మౌనిక, అంగారాకుల రమ్య, గ్రామస్థులు బాధనవేని రాజారామ్,జక్కు మోహన్,జక్కుల లక్ష్మీనర్సయ్య,ముద్దలా భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
బ‌రువు త‌గ్గాలా..? అయితే గుమ్మ‌డి పండును ఇలా తీసుకోండి!

Latest Rajanna Sircilla News