విజయశాంతిని పొమ్మనలేక పొగబెడుతున్నారా..?

తెలంగాణ రాష్ట్రం ( Telangana State ) లో బిజెపి మూడు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అనే విధంగా తయారయింది. కాంగ్రెస్ పార్టీ( Congress party )లో ఏ విధంగా అయితే అంతర్గత కలహాలు ఉంటాయో ప్రస్తుతం బిజెపి పార్టీ( BJP party )లో కూడా అలాంటి కలహాలే మొదలైనట్లు తెలుస్తోంది.

 False Propaganda Of Own Party Leaders On Vijayashanti , Vijayashanti , Telangan-TeluguStop.com

ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములే వాడి అనే విధంగా సీనియర్ నాయకుల పరిస్థితి తయారయిందట.సీనియర్ నాయకులకు అసలు రెస్పెక్ట్ లేకపోవడం వల్ల అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ నాయకులంతా మూకుమ్మడిగా పార్టీ మారబోతున్నట్టు ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి.సీనియర్ నాయకులలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విజయశాంతి( Vijayashanti ) .

ఈమె పార్టీలో గత కొంతకాలంగా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.అంతేకాకుండా ఈమె పార్టీ మారబోతుంది అంటూ చర్చ కూడా కొనసాగుతోంది.దీనికి ప్రధాన కారణం విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే.ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మునుగోడు ( Munugodu ) ఉప ఎన్నికల్లో కూడా పార్టీ తనకు ఏ మాత్రం సముచిత స్థానం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

అంతేకాకుండా ఈ మధ్యకాలంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ( Kishan Reddy ) ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విజయశాంతిని సరిగ్గా పట్టించుకోలేదని మధ్యలోనే వెళ్లిపోయింది.ఇది ఇలా ఉండగానే తాజాగా ఆమె మరో ట్వీట్ వైరల్ గా మారింది.సొంత పార్టీ నేతలే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా మండిపడింది.నేను పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకం కాదు, కానీ సొంత పార్టీ నేతలే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

కొంతమంది పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలే పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖండించింది.ప్రస్తుతం ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube