ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పసుపుల మద్దిలేటి

సూర్యాపేట జిల్లా:ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పసుపుల మద్దిలేటి తెలిపారు.

మహాత్మ గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్,రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు ఎన్ఎస్ఎస్ సెల్,ఎన్ ఎస్ ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో మంగళవారం స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇందులో భాగంగా బస్టాండ్లోని ప్లాస్టిక్ ను తొలగించడంతో పాటు పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.

Everyone Should Keep Their Surroundings Clean NSS Coordinator Dr Pasupula Maddil

ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలలో పరిశుభ్రతపై చైతన్యం తీసుకురావచ్చని అన్నారు.అనారోగ్యానికి గురి చేసే ఎన్నో వ్యాధులను అరికట్టవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మీనారాయణ,మేనేజర్ సైదులు,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు సునీల్,మల్లేష్, శృతి,ప్రీతి,ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్,స్పందన డిగ్రీ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
వలస కూలీ బాలికపై ఇటుక బట్టీ యజమాని అఘాయిత్యం

Latest Suryapet News