డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించండి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రత మహోత్సవం లో భాగంగా రాచర్ల బొప్పాపూర్ జ్ఞానదీప్ హై స్కూల్ లక్ష్మీనారాయణ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో బుధవారం రోజు న విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా పృధ్విరాజ్ మాట్లాడుతూ రోడ్డు పై వెళ్లే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని.

అలాగే సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయరాదు కారులో ప్రయాణిస్తే సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి అలాగే అతివేగం ప్రమాదకరం అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు మైనర్ డ్రైవింగ్ చట్టరీత్య నేరం అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని వారు అన్నారు.జ్ఞానదీప్ హై స్కూల్ నుంచి ఫ్లెక్సీ పట్టుకొని ప్లకాట్ పట్టుకొని గొల్లపల్లి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.

Everyone Driving Should Wear Helmet And Seat Belt, Driving ,wear Helmet , Seat B

ఈ కార్యక్రమంలో డిటిఓ లక్ష్మణ్, వంశీధర్, ప్రశాంత్, వేణు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కోడిని కూడా వదలలేదుగా.. హిప్నోటైజ్ చేసి పడేసిన వ్యక్తి... వీడియో వైరల్!
Advertisement

Latest Rajanna Sircilla News