పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - కమాండెంట్ యస్ శ్రీనివాసరావు

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్ 17వ పోలీస్ బెటాలియన్ నందు నిర్వహించిన ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా బెటాలియన్ కమాండెంట్ యస్.

శ్రీనివాసరావు తన వంతుగా మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తరువాత అధికారులు, సిబ్బంది అందరూ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ యస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆక్సిజన్ స్థాయిలను పెంచడంలో మొక్కలు పాత్ర కీలకం అని, మొక్కలు మానవాళి మనుగడకు ఎంతో దోహదం చేస్తూయాని, చెట్లను రక్షిస్తే అవి మనకి,మన భావితరాలకు రక్షణ కల్పిస్తాయని మొక్కల యొక్క ప్రాముఖ్యతను వివరించారు.మొక్కలను సంరక్షించే బాధ్యత అందరూ చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ లు ఎ.జయప్రకాష్ నారాయణ, శ్రీ యమ్.పార్థసారథి రెడ్డి,అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?
Advertisement

Latest Rajanna Sircilla News