వచ్చే ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు జీవన్మరణ సమస్యలాంటిదని విజ్ఞతతో ఆలోచించి సరయిన నిర్ణయం తీసుకోవాలని ప్రజలను కోరారు బీఆరఎస్ అదినేత కెసిఆర్.( CM KCR ) పాలమూరులో నిర్వహించిన ప్రజా గర్జన సభలో( Praja Garjana Sabha ) మాట్లాడిన ఆయన ఒకప్పుడు పాలమూరు నుంచి అత్యధికంగా వలసలు ఉండేవని ఇక్కడ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు గంజి కేంద్రాలను పెట్టించాయని, ఇక్కడ వడ్లు పండవు అని ప్రచారం చేసేవని, ఇప్పుడు ఇక్కడ వడ్లు పండుతున్నాయని, మద్దతు ధర కూడా లభిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.ఇందిరమ్మ రాజ్యం తెస్తానని చెప్తున్న కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలో పెదలను కాల్చి చంపేవారని ,మతకల్లోలాలు జరిగే వని ఎన్టీ రామారావు( NT Ramarao ) పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి రెండు రూపాయల బియ్యం ఇచ్చేవరకూ
ఇక్కడ ఆకలి బ్రతుకులే ఉండేవని కెసిఆర్ చెప్పుకుచ్చారు.ఇందిరమ్మ రాజ్యం సుభిక్షంగా ఉంటే ఎన్టీఆర్ ఆరోజు పార్టీ పెట్టేవారు కాదని ఆయన వ్యాఖ్యానించారు.9 ఏళ్ళ క్రితం తెలంగాణ ఎలా ఉండేదో, ఇప్పుడు తెలంగాణ( Telangana ) ఎలా ఉందో వచ్చిన మార్పులు ఏంటో ప్రజలు గమనించి ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు.కాంగ్రెస్ నేతలు( Congress Leaders ) ఇప్పుడు కౌలు రైతులంటూ కొత్త పంచాయతీలు పెడుతున్నారని, ప్రజలు కట్టె పన్నులతో రైతుబంధు ఇస్తున్నారని రైతుబంధు వృధా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) మాట్లాడుతున్నారని , రైతుబంధు కావాలా వద్దా ?అంటూ ఆయన ప్రజలని అడిగారు దాంతో పెద్ద ఎత్తున కావాలని స్పందన వచ్చింది.
కాంగ్రెస్ నేతలు ధరణిని ( Dharani ) బంగాళాఖాతంలో కలపాలంటున్నారని అప్పుడు తమ భూముల కోసం ప్రజలు కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.కరెంట్ వ్యవస్థ ని కాంగ్రెస్ నాశనం చేస్తుందని మళ్లీ వ్యవసాయాన్ని చీకటి రోజులలోకి నడిపిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.ఢిల్లీ నుంచి వచ్చే వారికి ఇక్కద ప్రజల సమస్యలు తెలియవని, మోటార్లకు మీటర్లు పెట్టనన్నందుకు 25వేల కోట్ల నిలిపేసిన మోడీ( Modi ) ఇప్పుడు తెలంగాణకు వచ్చి ఓట్లు ఎలా అడుగుతారు అంటూ ఆయన నిలదీశారు .