క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ కమిటి ఎన్నిక

సూర్యాపేట జిల్లా:తెలంగాణలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులు,చర్చి నిర్మాణాలు,ప్రభుత్వం మైనార్టీలకు అందిస్తున్న రాయితీలు,సువార్త ప్రకటన స్వేచ్ఛకు మనకున్న హక్కులను కాపాడుకోవడానికి క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఉండాలని తెలంగాణ క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ బి.

పీటర్ అన్నారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలోని చింతలచెరువు క్రీస్తు సంఘం చర్చి నందు సూర్యాపేట నియోజకవర్గ స్థాయి సేవకుల సమావేశానికి ఆయన ముఖ్యాతిధిగా హాజరై సేవకులకు పలు సూచనలు చేశారు.అనంతరం సూర్యాపేట నియోజకవర్గ క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నూతన కమిటీని నియమించారు.

చల్లా నవీన్ (ప్రెసిడెంట్),జెర్రిపోతుల ప్రసన్న కుమార్ (వైస్ ప్రెసిడెంట్), యాదాసు విజయ్ కుమార్ (జనరల్ సెక్రెటరీ),కందిబండ దుర్గాప్రసాద్ (జాయింట్ సెక్రటరీ),కోకా యేసురత్నం (ట్రెజరర్)గా నియమించబడ్డారు.ఈ సమావేశానికి పాస్టర్ దాసన్న, పాస్టర్ రవిపాల్,పాస్టర్ ప్రశాంత్,పాస్టర్ నంద్యాల ఎలీషారావు తదితరులు పాల్గొన్నారు.

డీజే మోతకు రూ.30 వేల జరిమానా విధించిన తహశీల్దార్...!
Advertisement

Latest Suryapet News