సీఎం జగన్ పై దాడి ఘటనపై ఈసీ కీలక ఆదేశాలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.వారం రోజులలో నామినేషన్ ల పర్వం ప్రారంభం కానుంది.

దీంతో ప్రధాన పార్టీల నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.అధికార పార్టీ వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) "మేమంతా సిద్ధం" పేరిట బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు.

మార్చి 27వ తారీకు ఇడుపులపాయలో మొదలైన ఈ బస్సు యాత్ర శనివారం విజయవాడకు( Vijayawada ) చేరుకుంది.ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ పై విజయవాడ సింగ్ నగర్ లో రాయి దాడి జరిగింది.

జగన్ ఎడమ కనుబొమ్మ పై బలమైన గాయం అయింది.దీంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో.

Advertisement

చికిత్స తీసుకున్నారు.

ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడి పట్ల ఈసీ ( EC ) ఆరా తీసింది.విజయవాడ సీపీ కాంతి రాణాకి( Vijayawada CP kanthi Rana ) ఎన్నికల ప్రధాన అధికారి ఫోన్ చేశారు.రేపటిలోగా ఘటనపై నివేదిక పంపాలని ఆదేశించడం జరిగింది.

దాడికి పాల్పడ్డ వారిని త్వరగా గుర్తించాలని కోరారు.మరోవైపు సీఎం జగన్ పై దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సరిగ్గా ఓ పాఠశాల ప్రాంతం దగ్గరకు బస్సు యాత్ర చేరుకున్న సమయంలో దాడి జరగడంతో.స్కూల్ చుట్టుప్రక్కల సీసీ కెమెరాలను పోలీసుల జల్లెడ పడుతున్నారు.

భారత్‌లోని ఆ ప్రాంతంలో తిరుగుతూ కెమెరాకి చిక్కిన యూఎఫ్ఓ?
'కుప్పం ' లో చంద్రబాబు గెలుస్తున్నారా ? పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి ముప్పో ? 

దాడి ప్రదేశంలోనే సీసీటీవీ కెమెరాల్లో అనుమానితుల కదలికలపై ఆరా తీస్తున్నారు.ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వేలిముద్రలను సేకరించి పలువురు అనుమానితులను విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు