వైసీపీ ఆవిర్భావం నుంచి కష్టపడిన వ్యక్తి దుట్టా..: ఎంపీ బాలశౌరి

ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో మరోసారి కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే బాపులపాడులో వైసీపీ నేత దుట్టా రామచంద్రరావును ఎంపీ బాలశౌరి కలిశారు.

 Dutta Is A Person Who Has Struggled Since The Birth Of Ycp..: Mp Balashauri-TeluguStop.com

అనంతరం ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ వైసీపీ సీనియర్ నేత దుట్టాను తాను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు.వైసీపీ ఆవిర్భావం నుంచి కష్టపడిన వ్యక్తి దుట్టా అని చెప్పారు.

వైఎస్ఆర్ కు అత్యంత సన్నిహితుల్లో దుట్టా కూడా ఒకరన్న సంగతి గుర్తు చేశారు.అనంతరం దుట్టా రామచంద్రరావు మాట్లాడుతూ మూడు నెలల క్రితం సీఎం జగన్ ను కలిశానన్నారు.

ఈ క్రమంలో సీఎం జగన్ కు చెప్పిన అభిప్రాయాన్నే బాలశౌరికి చెప్పానని తెలిపారు.అయితే గన్నవరం నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న రామచంద్రయ్య టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన వల్లభనేని వంశీపై కొంత అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇటీవల నెక్ట్స్ ఎలక్షన్స్ నేపథ్యంలో గన్నవరం వైసీపీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం వల్లభనేని వంశీనే ప్రకటించింది.ఈ క్రమంలోనే దుట్టాను బుజ్జగించే ప్రయత్నం చేస్తుందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube