ఆ డ్రింక్‌ తాగినా బరువు తగ్గలేదు.. నన్ను మోసం చేశారు..!

బరువు తగ్గాలా మా దగ్గరికి రండి.మా ప్రోడక్ట్స్‌ తాగండి లేదా తినండి.

బరువు తగ్గుతారు అంటూ మనం రోజూ టీవీల్లో ఎన్నో యాడ్స్‌ చూస్తూనే ఉంటాం కదా.అలాగే ఓ మహిళ కూడా టీవీలో వచ్చిన ప్రకటన చూసిన ఓ డైట్‌ సోడా తాగింది.అది కూడా ఒక రోజు, ఒక ఏడాది కాదు.

ఏకంగా 13 ఏళ్లుగా తాగుతూనే ఉంది.అయినా బరువు తగ్గలేదు.

దీంతో ఆ కంపెనీ నన్ను మోసం చేసిందంటూ ఆమె కోర్టుకెక్కింది.అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది.అయితే కోర్టు మాత్రం ఆ మహిళకు షాక్‌ ఇచ్చింది.

Advertisement

షానా బాకెరా అనే మహిళ 13 ఏళ్లుగా డాక్టర్‌ పెప్పర్‌ కంపెనీకి చెందిన డైట్‌ సోడాలను తాగుతోంది.డైట్‌ సోడాలు తాగితే బరువు తగ్గుతారన్న నమ్మకంతో ఆమె వాటిని కొనసాగిస్తూనే ఉంది.

అయితే ఇన్నేళ్లుగా తాగుతున్నా ఎలాంటి ప్రయోజనం లేదని గ్రహించి.చివరికి ఆ డాక్టర్‌ పెప్పర్‌ కంపెనీపై కేసు వేసింది.

తాను మోసపోయానని వాదించింది.అయితే డైట్‌ సోడా అని చెప్పాం తప్ప.

ఇది తాగితే బరువు తగ్గుతారని తాము ఎక్కడా చెప్పలేదని సదరు కంపెనీ వాదించింది.డైట్‌ అనే పదం ఉంది అంటే.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : తలుపు తెరిస్తే ఎదురుగా భీకరమైన పులి.. చివరికేమైందో చూస్తే షాక్!

అది ఇతర సాధారణ డ్రింక్స్‌ కంటే కాస్త తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది అని మాత్రమే అర్థం.

Advertisement

అంతే తప్ప ఇది తాగితే బరువు తగ్గుతారని కాదు అని ఆ కంపెనీ స్పష్టం చేసింది.కాలిఫోర్నియాలోని నైన్త్‌ సర్క్యూట్‌ అప్పీల్స్‌ కోర్టు కూడా కంపెనీ వాదనతో ఏకీభవించి.కేసును కొట్టేసింది.

షానా బాకెరా ఇలా కంపెనీలపై కేసు వేయడం ఇదే తొలిసారి కాదు.గత వారం కూడా డైట్‌ కోక్‌పై కేసు వేస్తే.

కోర్టు ఆ కేసును కూడా కొట్టేసింది.అంతేకాదు ఈ సోడా యాడ్‌లో ఆకర్షణీయమైన మోడల్స్‌ను కంపెనీ వాడిందని, దానిని బట్టి ఈ సోడా తాగితే అలా అవుతారనే కదా అర్థం అంటూ కూడా ఆ మహిళ వాదించింది.

కానీ కోర్టు మాత్రం ఆమె వాదనను తోసిపుచ్చింది.అందమైన మోడల్స్‌ను వాడినంత మాత్రాన అలా అవుతారని లేదు అని కోర్టు స్పష్టం చేసింది.

తాజా వార్తలు