చలి తట్టుకోలేక టీలు, కాఫీలు తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..

శీతాకాలంలో చలి చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఆ చలి బాధను తట్టుకోలేక చాలా మంది కాఫీలు, టీలు తాగుతూ ఉంటారు.

అదేవిధంగా శీతాకాలంలో ఎక్కువగా జలుబు సమస్యలు వెంటాడుతుంది.

దీని నుంచి ఉపశమనం పొందేందుకు కూడా చాలామంది తరచుగా కాఫీ, టీలు తాగుతారు.కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం ఎక్కువగా టీ, కాఫీలు తాగడం ఆరోగ్యానికి హానికరం అని అంటున్నారు.

ఎందుకంటే టీ, కాఫీలో అధికంగా కెఫీన్ ఉంటుంది.ఇది డీహైడ్రేషన్ కు దారితీస్తుంది.

అంతేకాకుండా టీ లేదా కాఫీ తాగడం వల్ల నిద్ర సమస్యలు కూడా వస్తాయి.దీంతో ఈ అలవాటును నియంత్రించుకోవడం చాలా అవసరం.

Advertisement

టీ లేదా కాఫీ తాగే అలవాటు ను తగ్గించుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి.అవి పాటిస్తే కొంతవరకు టీ కాఫీ తాగే కోరికలను తగ్గించుకోవచ్చు.

అయితే ఏకంగా మొత్తంగా టీ, కాఫీ వ్యాసనాన్ని ఒకేసారిగా అరికట్టలేము.

కానీ క్రమంగా ఈ అలవాటును అరికట్టవచ్చు.అయితే రోజుకు నాలుగు నుండి ఐదు కప్పుల కాఫీ తాగే వాళ్ళు ఈ అలవాటు తగ్గించాలనుకుంటే రోజుకు మూడు కప్పుల టీ మాత్రమే తాగాలి.ఇలా క్రమంగా చేయడం వల్ల అలవాటును తగ్గించుకోవచ్చు.

అలాగే టీ, కాఫీలకు బదులుగా ఇంట్లో తయారు చేసుకున్న పసుపు పాలను తాగవచ్చు.ఇందులో పుష్కలమైన పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా శరీరాన్ని లోపల నుండి వెచ్చగా ఉంచేందుకు సహాయపడతాయి.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

ఇది మాత్రమే కాకుండా పసుపు పాలు తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది.

Advertisement

అలాగే వేడి నీటిలో అల్లం వేసి మరిగించాలి.ఆ తర్వాత అందులో కాస్త నిమ్మరసం అలాగే తేనె కలపాలి.ఇక ఈ మిశ్రమాన్ని తరచూ తాగాలి.

ఇది దగ్గు, జలుబు నుండి ఉపశమనం కలిగేందుకు సహాయపడుతుంది.అలాగే జీర్ణ సమస్యల నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.

చలికాలంలో టీ, కాఫీలకు బదులుగా ఇలాంటి లెమన్ గ్రాస్ టీ, గ్రీన్ టీ లాంటివి తీసుకోవడం మంచిది.ఎందుకంటే వీటన్నిటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

దీంతో మన శరీరం ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది.

తాజా వార్తలు