బిల్వ వృక్షాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా ... లేదా అని సందేహపడుతున్నారా?

మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని రకాల మొక్కలను వృక్షాలను దైవ సమానంగా భావిస్తాము.

ఈ క్రమంలోనే అలాంటి దైవ సమానమైన మొక్కలు ఇంట్లో ఉండటం వల్ల శుభప్రదం అని పండితులు చెబుతుంటారు.

అయితే చాలా మందికి కొన్ని సందేహాలు కూడా వ్యక్తమవుతుంటాయి.ఇలాంటి వాటిలో శివునికి ఎంతో ప్రీతికరమైన బిల్వ వృక్షం ఇంటిలో పెట్టుకోవచ్చా అనే సందేహం కలుగుతుంది.

మరి శివునికి ఎంతో ప్రీతికరమైన ఈ చెట్టు ఇంట్లో ఉండవచ్చా లేదా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.పరమ శివుడికి ప్రీతికరమైన వాటిలో బిల్వ పత్రాలు ఒకటి.

బిల్వ పత్రాలతో పరమశివుడికి పూజ చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు.ఇలా మూడు పత్రాలు కలిగిన ఈ బిల్వదళం శక్తి, జ్ఞానశక్తి, క్రియా శక్తికి ఇది నిదర్శనం.

Advertisement
Doubt To Put Bilwa Tree In Houses Or Not , Bilwa Tree , Houses , Worship , Hind

ఎంతో పవిత్రమైన ఈ బిల్వదళాలతో శివుడికి అర్చన చేయడం వల్ల వేలాది మందికి అన్నదానం చేసిన పుణ్య ఫలం దక్కుతుంది.అదే విధంగా ఎన్నో పుణ్య నదులలో స్నానం చేయడం వల్ల కలిగే పుణ్యఫలం కూడా కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

Doubt To Put Bilwa Tree In Houses Or Not , Bilwa Tree , Houses , Worship , Hind

ఈ బిల్వదళాలతో పరమేశ్వరుడికి అర్చన చేయటంవల్ల 108 శైవ క్షేత్రాలను దర్శించిన పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతారు.ఇలా ఎంతో పవిత్రమైన ఈ బిల్వ వృక్షాన్ని ఇంటి ఆవరణంలో పెంచుకోవడం ఎంతో శుభసూచకం.ఈ బిల్వ వృక్షం నుంచి వచ్చే గాలిని పీల్చడం లేదా ఆ బిల్వ వృక్షం నీడ మనపై పడేలా ఉండటం వల్ల అధిక శక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

ఇక ఎవరైతే బిల్వ వృక్షానికి పూజలు చేసి పూజిస్తారో అలాంటి వారికి సకల సంపదలు కలుగుతాయని ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని పండితులు.అయితే బిల్వ దళాలను ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదు.

తులసితో సమానంగా బిల్వ వృక్షాన్ని కూడా పవిత్రంగా భావించి పూజించడం వల్ల శివయ్య అనుగ్రహం మనపై ఉంటుంది.

సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!
Advertisement

తాజా వార్తలు