ఓట్స్‌ను ఇలా తీసుకుంటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌!

ఓట్స్.నేటి కాలంలో వీటి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.చాలా మంది ఓట్స్‌ను రెగ్యుల‌ర్ డైట్‌లో చేర్చుకుంటున్నారు.

ముఖ్యంగా బ‌రువు త‌గ్గాలి అని భావించే వారు.ఖ‌చ్చితంగా ఓట్స్‌ను తీసుకుంటారు.ఎందుకంటే, ఓట్స్‌లో చాలా త‌క్కువ మోతాదులో కేల‌రీలు ఉంటాయి.

మ‌రియు కొంచెం తిన్నా.ఎక్కువ స‌మ‌యం పాటు క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది.

దాంతో వేరే ఆహారాలు తీసుకోలేరు ఫ‌లితంగా బ‌రువు త‌గ్గుతాయి.అందుకే ఓట్స్‌ను ఎక్కువ‌గా తీసుకుంటుంటారు.

Advertisement
Dont Eat Oats Like This! Eat Oats, Oats, Latest News, Health, Health Tips, Good

అయితే కొంద‌రు ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో, మ‌ధ్యాహ్నాం లంచ్‌లో, సాయంత్రం డిన్న‌ర్‌లో ఇలా అన్ని పూట‌లు ఓట్స్‌నే తీసుకుంటారు.వేరే ఆహారాల‌ను తీసుకోరు.

అయితే ఇలా చేయ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే, ఓట్స్‌లో కేల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి.

కానీ, ఒక వ్యక్తికి రోజూ అవసర‌మ‌య్యే అన్ని పోషకాలు ఓట్స్‌లో ల‌భించ‌వు.దాంతో పోష‌కాల లోపం ఏర్ప‌డి అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

Dont Eat Oats Like This Eat Oats, Oats, Latest News, Health, Health Tips, Good

అందుకే ఏదో ఒక పూట మాత్ర‌మే ఓట్స్‌ను తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అలా తీసుకోవ‌డ‌మే ఆరోగ్యానికి మంచిద‌ని అంటున్నారు.ఇక ఓట్స్ అంద‌రికీ ప‌డ‌క‌పోవ‌చ్చు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

అయితే కొద్ది కొద్దిగా అల‌వాటు చేసుకుంటే చాలా మేలు జ‌రుగుతుంది.మ‌రో విష‌యం ఏంటంటే.

Advertisement

ఓట్స్‌ను డైట్ లో చేర్చుకున్న వారు నీరు కూడా అధికంగా తాగాల్సి ఉంటుంది.ఓట్స్‌లో కేల‌రీలు త‌క్కువ‌గా.

ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది.ఓట్స్‌ను రెగ్యుల‌ర్‌గా త‌గిన మోతాదులో తీసుకుంటే గుండె జ‌బ్బులు, మ‌ధుమేహం, ర‌క్త పోటు, ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు, అధిక బ‌రువు స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండొచ్చు.

ఇక ఓట్స్‌ను పాల‌లో, తేనెలో క‌లుపుకుని తీసుకోవ‌చ్చు.లేదా ఓట్స్‌తో త‌యారు చేసుకున్న ఇడ్లీ కూడా తీసుకోవ‌చ్చు.

ఎలా తీసుకున్నా.రోజుకు ఒకపూట మాత్ర‌మే తీసుకోవాలి.

తాజా వార్తలు