సంకెళ్ళతో బంధీగా ఉండి కాపలా కాస్తున్న ఆంజనేయస్వామి ఎక్కడున్నాడో తెలుసా

మన సనాతన భారత దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు, పురాతన పట్టణాలు ఉన్నాయి.

ఈ విధంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒరిస్సాకు చెందిన పూరి జగన్నాథ ఆలయం ఒకటి అని చెప్పవచ్చు.

ఈ పూరి జగన్నాథ ఆలయంలో ఆంజనేయస్వామిఆలయం కూడా ఉంది.ఈ ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దారియ మహా వీర దేవాలయం అని కూడా పిలుస్తారు.

అయితే ఇప్పటి వరకు ఏ ఆలయంలో చూడని విధంగా ఆంజనేయ స్వామిని ఇక్కడ దర్శించుకోవచ్చు.ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి సంకెళ్ళతో బంధించబడి ఉంటాడు.

ఈ విధంగా స్వామి వారిని సంకెళ్లతో బంధించడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.పురాణాల కథల ప్రకారం జగన్నాథ ఆలయం ఈ ప్రాంతంలో వెలసిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి సముద్ర దేవుడు ఆలయాన్ని సందర్శించాడు.

Advertisement
Do You Know The Whereabouts Of Anjaneyaswamy Who Is Being Held Captive And Guard

అయితే సముద్ర దేవుడు ఇక్కడికి రావడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా నీటితో మునిగిపోయి హానికర వాతావరణం ఏర్పడింది.అయితే ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు సముద్ర దేవుడి నుంచి తమను రక్షించాల్సినదిగా ఆ జగన్నాథుని వేడుకున్నారు.

భక్తుల ప్రార్థనలతో అనుగ్రహించిన జగన్నాథుడు ఆ ప్రాంతానికి రక్షకుడిగా ఆంజనేయ స్వామినీ ఉండాల్సిందిగా వివరించాడు.

Do You Know The Whereabouts Of Anjaneyaswamy Who Is Being Held Captive And Guard

ఆంజనేయస్వామి రామభక్తుడు అనే విషయం మనకు తెలిసిందే.అయితే ఈ జగన్నాధుని అనుమతి లేకుండా ఆంజనేయుడు అయోధ్య వెళ్ళినట్లు తెలియడంతో ఎంతో ఆగ్రహించిన జగన్నాథుడు ఈ ప్రాంతాన్ని రాత్రీ,పగలు కాపాడాల్సిన బాధ్యతలను హనుమంతుడు మర్చిపోయాడని భావించి ఆంజనేయుడి కాళ్లు, చేతులను సంకెళ్లతో బంధించి ఇకపై ఈ స్థలంలో సదా వెలిసి ఉండు.ఈ స్థలంలోకి ఎటువంటి సముద్రపు నీరు రాకుండా, ఇక్కడి ప్రజలను రక్షించాల్సినదిగా జగన్నాథుడు ఆంజనేయుడికి తెలియజేశాడు.

అప్పటి నుంచే ఈ ఆలయంలో కొలువై ఉన్న ఆంజనేయుడిని దారీయ మహావీర అని కూడా పిలుస్తారు.అంటే సముద్రం నుంచి ఆ మహా నగరాన్ని సంరక్షిస్తున్న అని అర్థం.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

అదేవిధంగా సంకెళ్ళతో బంధింపబడి ఉన్నాడు కాబట్టి బేడీ హనుమంతుడు అని కూడా పిలుస్తారు.సముద్ర గర్భం తీరం దగ్గరే ఉన్న ఎంత పెద్ద తుఫాన్ వచ్చినప్పటికీ ఈ స్థలంలోకి సముద్రపు నీరు చేరదని అక్కడి ప్రజలు తెలియజేస్తారు.

Advertisement

తాజా వార్తలు