నళిని దంపతుల ప్రేమను చూసి ఆశ్చర్యపోయిన న్యాయమూర్తి..

ప్రేమసాగరం.టీ రాజేందర్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు.తెలుగులో ఏకంగా ఏడాది పాటు ఆడింది ఈ సినిమా.ఒక డబ్బింగ్ సినిమా తెలుగులో అంతకాలం ఆడటంతో అదే తొలిసారి.ఈ సినిమాలోని పాటలన్నీ అద్భుతంగా జనాలను ఆకట్టుకున్నాయి.

 Do You Know The Love Story Of Actress Nalini, Actress Nalini, Actor Ramarajan, P-TeluguStop.com

ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది హీరోయిన్ నళిని.ఆ తర్వాత చిరంజీవితో కలిసి సంఘర్షణ, ఇంటిగుట్టు అనే సినిమాల్లో నటించింది.ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి.ఈ దెబ్బతో నళిని హీరోయిన్ గా మంచి పేరు సంపాదించింది.కెరీర్ పీక్స్ లో ఉండగానే తమిళ స్టార్ నటుడు రామరాజన్ ను పెళ్లి చేసుకుంది.కొంతకాలం సినిమాలకు దూరం అయ్యింది.

ఆ తర్వాత కొంతకాలానికి మళ్లీ సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.సినిమాలతో పాటు పలు టీవీ షోలు చేసింది.

ఎయిటీస్ లో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటులతో రామరాజన్ గట్టిగా పోటీ పడేవాడు.ఆయనతో సినిమాలో నటించే సమయంలో నళిని ప్రేమలో పడింది.ఇద్దరూ 1987లో పెళ్లి చేసుకున్నారు.వీరికి ఓ బాబు, ఓ పాప జన్మించారు.

వారి పేరు అరుణ, అరుణ్.కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి.2000 సంవత్సరంలో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.పిల్లలు తల్లిదగ్గరే పెరిగారు.

Telugu Nalini, Ramarajan, Actress Nalini, Chiranjeevi, Aruna, Divorce, Judge Sho

అయినా తండ్రి దగ్గరికి వెళ్లి వచ్చేవారు.అనంత‌ర కాలంలో అభిప్రాయ భేదాలు, మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్త‌డంతో 2000 సంవ‌త్స‌రంలో న‌ళిని, రామ‌రాజ‌న్ విడాకులు తీసుకున్నారు.పిల్ల‌లిద్ద‌రూ న‌ళిని వ‌ద్ద‌నే పెరుగుతూ వ‌చ్చారు.ఎప్పుడు కావాలంటే అప్పుడు తండ్రి ద‌గ్గ‌ర‌కు వెళ్లేవారు.విడిపోయిన న‌ళిని, రామ‌రాజ‌న్‌ల‌లో ఎవ‌రూ రెండో వివాహం చేసుకోలేదు.

Telugu Nalini, Ramarajan, Actress Nalini, Chiranjeevi, Aruna, Divorce, Judge Sho

తాజాగా తన తల్లిదండ్రుల గురించ వారి కుమార్తె అరుణ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది.వీరిద్దరు విడాకులు తీసుకున్నప్పటికీ.ఇప్పటికీ ఇద్దరికి ఒకరిపై మరొకరికి ఎంతో గౌరవం ఉందని వెల్లడించింది.

ఒకరి గురించి మరొకరు ఎప్పుడూ చెడుగా చెప్పుకోరని చెప్పింది.అటు కోర్టులో విడాకుల మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి చెప్పగానే నళిని కళ్లుతిరిగి కింద పడిపోయినట్లు చెప్పింది.

వెంటనే తన భర్త ఆమె దగ్గరికి వచ్చి పట్టుకున్నట్లు చెప్పింది.వారిని చూసి న్యాయమూర్తి ఆశ్చర్యపోయినట్లు చెప్పింది.

ఇంత ప్రేమ ఉన్న వీరిద్దరు ఎందుకు విడిపోతున్నారో? ఆయనకు అర్థం కాలేదని చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube