మీకు వాట్సాప్‌లో ‘బుక్‌మార్క్‌’ పెట్టుకోవడం తెలుసా?

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తమ వినియోగదారులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటుంది.అందుకే ప్రతిరోజూ ఏదో ఒక నయా ఫీచర్‌ను పరిచయం చేస్తూనే ఉంటుంది.

దీనికి వినియోగదారులు కూడా ప్రపంచవ్యాప్తంగా బిలియన్లలో ఉన్నారు.సాధారణంగా వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌లు, టెక్ట్స్, వీడియోస్, ఫోటోస్‌ను షేర్‌ చేసుకోవచ్చు.

అయితే చాట్‌ ఆప్షన్‌లో గతం వచ్చిన మెసేజ్‌లు ఏవైనా ముఖ్యమైనవి అయి ఉండవచ్చు.వీటిని చాట్‌లో వెతుక్కునే పనిలేకుండా సులభంగా అటువంటి మెసేజ్‌లు చూడవచ్చు.

ఫేస్‌బుక్‌ మాతృసంస్థ అయిన వాట్సాప్‌ దీనికి ‘స్టార్‌’ అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తుంది.అంటే మీకు ముఖ్యమైన మెసేజ్‌లను బుక్‌మార్క్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

Advertisement
Do You Know How To Bookmark Whatsapp Messages, Whatsapp Messages,starred Message

ఈ మెసేజ్‌లను మీకు అవసరమైనపుడు చూసుకునే వీలు ఉంటుంది.అయితే, ఆ చాట్స్‌కు బుక్‌ మార్క్‌ ఎలా పెట్టుకోవాలి.

వాటిని మళ్లీ చూడాలంటే ఎలా చదవాలి? ప్రాసెస్‌ ఎంటో తెలుసుకుందాం.బుక్‌మార్క్, స్టార్‌ వాట్సాప్‌లో ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం.

వాట్సాప్‌ చాట్‌కు బుక్‌ మార్క్‌ పెట్టుకునే విధానం.

Do You Know How To Bookmark Whatsapp Messages, Whatsapp Messages,starred Message

ముందుగా దీనికి మీ స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌ చేసి, వాట్సాప్‌ ఓపెన్‌ చేయాలి.ఆ తర్వాత మీకు కావాల్సిన వ్యక్తి లేదా గ్రూపు చాట్‌ దేనికి బుక్‌ మార్క్‌ పెట్టాలో దాన్ని ఓపెన్‌ చేయాలి.అందులోని ఆ ముఖ్యమైన మెసేజ్‌ను సెలెక్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
నాగార్జున విషయంలో ఎందుకిలా జరుగుతుంది...

దాన్ని ఎంచుకున్న వెంటనే చాట్‌ విండో ట్యాబ్‌లో మీకు స్టార్‌ ఐకాన్‌ కనిపిస్తుంది.అప్పుడు ఆ స్టార్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేస్తే మీకు కావాల్సిన మెసేజ్‌లు బుక్‌ మార్క్‌ అయిపోతాయి.

Advertisement

మీకు అవసరం లేనప్పుడు ఆ మెసేజ్‌లకు బుక్‌ మార్క్‌ తొలగించడం కూడా సులభం.దీనికి వాట్సాప్‌ ఓపెన్‌ చేసి.

స్టార్డ్‌ మెసేజెస్‌ను ట్యాప్‌ చేసి హొల్డ్‌ చేయాల్సి ఉంటుంది.ఆ తర్వాత అన్‌స్టార్‌ అనే ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకుంటే సరిపోతుంది.

బుక్‌ మార్క్‌ మెసేజ్‌లను చూడటం.

వాట్సాప్‌ ఓపెన్‌ చేసి.కుడివైపు మూడు చుక్కలపై క్లిక్‌ చేయాలి.ఆ తర్వాత డ్రాప్‌ డౌన్‌ మెనూలో ‘స్టార్డ్‌ మెసేజెస్‌’ను సెలెక్ట్‌ చేసుకోవాలి.

అప్పుడు మీరు బుక్‌ మార్క్‌ పెట్టిన అన్ని మెసేజ్‌లు అక్కడ కనిపిస్తాయి.

తాజా వార్తలు