వైరల్: బంగారాన్ని ఇలా కూడా స్మగ్లింగ్ చేస్తారా..?

గత కొన్ని రోజులుగా బంగారం అక్రమ రవాణా దర్జాగా సాగుతోంది. కరోనా వల్ల బంగారం ధరలు పైపైకి చేరాయి.

దీంతో బంగారంలో పెట్టుబడులు పెట్టినవారు లాభాలతో సంతోషంగా ఉన్నారు.ఇలాంటి సమయంలో కొందరు బంగారాన్ని అక్రమ రవాణా చేసి డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు.

గత కొన్ని రోజులుగా అక్రమ బంగారం రవాణా అవుతోంది.దీనిని అడ్డుకట్ట వేయడానికి అధికారులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

అయినప్పటికీ వారి శ్రమ వృధా అయిపోతుంది.స్మగ్లర్లు రకరకాలుగా ఆలోచించి అధికారులకు చిక్కకుండా బంగారాన్ని రవాణా చేస్తున్నారు.

Advertisement

తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. కేరళలోని కన్నూరు విమానాశ్రయంలో ఓ వింత అక్రమ రవాణా జరిగింది.

అధికారులు దానిని గుర్తించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే విమానాలు ల్యాండ్ అవ్వగానే ప్రయాణికులు ఎవరిపాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు.

ఇంతలో ఓ వ్యక్తి పసుపు మరకలతో బయటకు వచ్చాడు.అతన్ని చూడగానే కస్టమ్స్ అధికారులకు డౌట్ వచ్చింది.

అతనిని చెక్ చేస్తే అధికారులు షాకింగ్ విషయం తెలుసుకున్నారు.అతని ప్యాంటు మరకలు పెయింట్ కాదని, అది మొత్తం బంగారమే అని అధికారులు గుర్తించారు.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : తలుపు తెరిస్తే ఎదురుగా భీకరమైన పులి.. చివరికేమైందో చూస్తే షాక్!

ఆ వ్యక్తి ధరించిన ప్యాంటు మూడు పొరలతో ఉంది.అందులో మధ్యలో ఉన్న పొరలో బంగారాన్ని పేస్టులా చేసుకొని అతను రవాణా చేస్తున్నాడు.

Advertisement

ఆ వ్యక్తి అమాయకుడిలా ఉన్నాగానీ అతను చేసిన పని మాత్రం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది.దాదాపుగా 302 గ్రా.

బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఆ బంగారం విలువ రూ.14 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

కత్తిరించిన ఫోటోలను అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఇందూకు సంబంధించి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.కొందరు ఆ దొంగను చాలా తెలివికలవాడని మెచ్చుకుంటున్నారు.

మరికొందరు మెటల్ డిటెక్టర్ ఉండేచోట బంగారాన్ని ఎలా తీసుకెళ్లాడని నవ్వుకుంటున్నారు.ఇంకొందరు అతడు దొంగతనం చేసిన విధానాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

తాజా వార్తలు