టెన్నిస్ కోర్ట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) నూతన జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఫ్లెడ్ లైట్స్ వెలుగులతో ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్ట్ ను జిల్లా ఎస్పీ ( District SP Akhil Mahajan )అధికారులతో కలిసి బుధవారం రోజున ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.

జిల్లాలో పని చేస్తున్న అధికారుల సిబ్బంది సంక్షేమనికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అధికారులు , సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటానికి ఈ టెన్నిస్ కోర్టు అందుబాటులోకి తీసుకరావడం జరిగిందని అన్నారు.నిత్యం శాంతి భద్రతల పరిరక్షణలో బిజీగా ఉండే సిబ్బందికి క్రీడలు మానసిక స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్నారు.

పోలీస్ అధికారులు , సిబ్బంది వారి పిల్లల కోసం ఫ్లెడ్ లైట్స్ ల వెలుగులతో అందుబాటులోకి తీసుకవచ్చిన అత్యాధునిక టెన్నిస్ కోర్టు ని సద్వినియోగం చేసుకోవలని అన్నారు.క్రీడలు మనలో దాగున్న శక్తి సామర్థ్యాలను, పోరాట పటిమను వెలికి తీస్తాయన్నారు.

పోలీసులు ఈదే స్ఫూర్తిని ప్రొఫెషన్ లోనూ చూపించాలి అన్నారు.పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి క్రీడలు తోడ్పడతాయని, శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి క్రీడలు దోహదపడతాయన్నారు.

Advertisement

పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఫ్లెడ్ లైట్స్ ల వెలుగులతో అత్యాధునిక టెన్నిస్ కోర్టు అందుబాటులోకి తీసుకవచ్చిన జిల్లా ఎస్పీ గారికి అధికారులు సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,ఆర్.

ఐ లు మాధుకర్, యాదగిరి, రమేష్, సి.ఐ రఘుపతి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News