కనుమరుగవుతున్న గ్రామీణ హరికథ,వీధి భాగవతాలు

సూర్యాపేట జిల్లా:ఒకనాడు గ్రామీణ ప్రాతాల్లో ఓ వెలుగు వెలిగిన బుర్రకథ,వీధి బాగోతాలు నేడు ఆదరణ కోల్పోయి కనుమరుగు అవుతున్నాయని కోదాడకు చెందిన సామాజిక కార్యకర్త జలగం సుధీర్ అవేదన వ్యక్తం చేశారు.

సోమవారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కోమరబండ కెఎల్ఆర్ గేటెడ్ కమ్యూనిటిలో జరిగిన సామూహిక వనభోజనాల సంధర్భంగా అంతరించిపోతున్న బుర్రకథ,వీధి బాగోత కళను బతికిస్తున్న కొద్ది మంది కళాకారులను సన్మానించి గౌరవించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుమారు 40 యెండ్ల కిందట వరకు గ్రామాల్లో బుడిగ జంగాల వర్గాలకు చెందిన కళాకారులు హరికథ,వీధి భాగవతాల కార్యక్రమాలు చేసి ప్రజలకు ఆనందం పంచేవారని గుర్తు చేశారు.ఈ సందర్భంగా అనంతగిరి మండలంలోని వెంకట్రామాపురం గ్రామానికి చెందిన రెవల్లి అచ్చయ్య ఆధ్వర్యంలో కళాకారులు శ్రీక్రిష్ణ-ఆర్జునుడు-సుభద్రలకు సంబందించి కొంతసేపు తమ కళను ప్రదర్శించారు.

ఈ కళాకారుల గురించి నేటి తరానికి వివరించటంతో చాలమంది వారితో ఫోటోలు దిగటానికి ఉత్సాహం చూపారు.

Advertisement

Latest Suryapet News