కరోనా సెకండ్‌ వేవ్‌ ఒత్తిడిని పోగొట్టేలా 'ఎఫ్‌3' ఉంటుందట

టాలీవుడ్‌ లో వరుసగా సక్సెస్ లు దక్కించుకుంటున్న దర్శకులు కొద్ది మంది మాత్రమే ఉన్నారు.వారిలో అనీల్ రావిపూడి ఒకరు.

పటాస్‌ నుండి మొదలుకుని మొన్నటి సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు అనీల్‌ రావిపూడి కెరీర్‌ లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు ఉన్నాయి.ఈయన కెరీర్‌ లో ఎఫ్‌ 2 సినిమా కీలకంగా చెప్పుకోవాలి.

Director Anil Ravipudi Interesting Comments On F3 Movie , Anil Ravipudi , F2 Mo

వెంకటేష్ మరియు వరుణ్‌ తేజ్‌ లు హీరోలుగా నటించిన ఎఫ్‌ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.దిల్‌ రాజు నిర్మించిన ఆ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

సింపుల్‌గా ఉన్న ఆ సినిమా భారీ వసూళ్లను సాధించింది.ఎఫ్‌ 2 సినిమా కు సీక్వెల్‌ గా ప్రస్తుతం ఎఫ్‌ 3 సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.

Advertisement

ఎఫ్‌ 3 సినిమా ను మరింత వినోదాత్మకంగా తీర్చిదిద్దుతున్నట్లుగా దర్శకుడు అనీల్‌ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనీల్‌ రావిపూడి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కరోనా సెకండ్‌ వేవ్‌ ఒత్తిడి పోగొట్టే విధంగా ఎఫ్‌ 3 నవ్వుల జల్లు ఉంటుందని చెప్పుకొచ్చాడు.

ఎఫ్‌ 3 సినిమా తో జనాల ఒత్తిడి పూర్తిగా తగ్గిస్తామని ఆయన హామీ ఇస్తున్నాడు.ఎఫ్‌ 3 సినిమా లో కూడా వెంకటేష్‌ మరియు వరుణ్‌ తేజ్‌ లు హీరోలుగా నటిస్తుండా తమన్నా మరియు మెహ్రీన్‌ లు హీరోయిన్స్‌ గా నటించారు.

ఇక రాజేంద్ర ప్రసాద్‌ మరియు సునీల్ ల కామెడీ సన్నివేశాలు అద్బుతం అన్నట్లుగా ఉంటాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.డబ్బు చుట్టు తిరిగే కథతో ఈ సినిమా రూపొందింది.

పెద్ద ఎత్తున ఈ సినిమా ను హైదరాబాద్ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు.అనీల్ రావిపూడికి కరోనా నిర్థారణ అవ్వడంతో షూటింగ్ నిలిచి పోయింది.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

మళ్లీ ఈ నెల చివరి వరకు షూటింగ్‌ ను పునః ప్రారంభించే అవకాశం ఉందట.ఆగస్టులో ఎఫ్‌ 3 విడుదల అంటున్నారు.

Advertisement

కరోనా సెకండ్‌ వేవ్‌ కాస్త తగ్గి థియేటర్లు ఓపెన్‌ అయితే అనుకున్న తేదీకే ఎఫ్‌ 3 సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు.

తాజా వార్తలు