శాకుంతలం ఎఫెక్ట్‌... ఆ పనిని కొన్నాళ్లు పక్కకి పెట్టిన దిల్ రాజు!

సమంత( Samantha ) హీరోయిన్‌ గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా( Shakunthalam movie ) వల్ల దిల్‌ రాజు దాదాపుగా రూ.40 కోట్ల రూపాయలను నష్టపోయాడు అనేది టాక్‌.

దిల్ రాజు ఇండస్ట్రీ లో డిస్ట్రిబ్యూషన్ మరియు నిర్మాణం మొదలు పెట్టిన తర్వాత ఒక ప్రాజెక్ట్‌ తో ఈ రేంజ్ లో నష్టపోవడం ఇదే ప్రథమం.

అయినా కూడా దిల్ రాజు ఇతర ప్రాజెక్ట్‌ లతో భారీ గా లాభాలు దక్కించుకుంటాడు కనుక ఆయన డిస్ట్రిబ్యూషన్ మానేయడు అనుకున్నారు.

Dil Rajus Shocking Decision Due To Shakunthalam Movie, Shakunthalam Movie, Di

కానీ దిల్‌ రాజు పై శాకుంతలం సినిమా ప్రభావం చాలా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దిల్‌ రాజు వల్లే శాకుంతలం సినిమా ఆ మాత్రం అయినా వసూళ్లు చేసింది.కనుక తమ సినిమా లను కూడా దిల్ రాజు( Dil Raju ) చేతిలో పెట్టాలి అనుకుంటున్నారు.

కానీ దిల్‌ రాజు మాత్రం ప్రస్తుతానికి తన సొంత సినిమా లను తప్ప ఇతర సినిమా లను కమిట్‌ అవ్వాలని.వాటి బాధ్యతలను తీసుకోవాలని లేదు.అందుకే ముందు ముందు కూడా భారీ సినిమా లు క్రేజీ సినిమా లను ఆయన పంపిణీ చేయవద్దని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement
Dil Raju's Shocking Decision Due To Shakunthalam Movie, Shakunthalam Movie, Di

ఆయన నిర్మిస్తున్న సినిమా లు మినహా మరే సినిమా ల బాధ్యతలను ఆయన తలకు ఎత్తుకోవడం లేదు.

Dil Rajus Shocking Decision Due To Shakunthalam Movie, Shakunthalam Movie, Di

మొత్తానికి శాకుంతలం సినిమా కారణంగా దిల్ రాజు పంపిణీ విషయం లో చాలా జాగ్రత్త లు తీసుకుంటున్నాడు.తద్వారా చాలా చిన్న సినిమా లు కూడా ఉసూరుమంటున్నారు.శాకుంతలం సినిమా వల్ల దర్శకుడు గుణశేఖర్ కూడా ఢీలా పడిపోయాడు.

ఇక హీరోయిన్‌ గా సమంత కూడా చాలా కష్టాలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.దిల్ రాజు ప్రస్తుతం తెలుగు తో పాటు ఇతర భాష ల్లో కూడా నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు