ఇక 'ముద్దుల' రికార్డు లేనట్టే... ప్రకటించిన గిన్నిస్!

ముద్దుల రాయుళ్లు, రాణులకు ఇది చేదు వార్తే.అవును, మీకు ఇక ఆ అవకాశం లేకుండా పోయింది.

 Guinness World Records Deactivate The Longest Kiss World Record Details, Kissing-TeluguStop.com

ఈపాటికే మీరు బాగా ప్రాక్టీస్ చేసి వుంటారు.అయితే మీ సాహసం అడవి కాచిన వెన్నెల కాకతప్పదు.

ప్రతిష్ఠాత్మక గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌( Guinness Book of World Records ) సాధించేందుకు ఒక్కొక్కరు ఒక్కో ప్రయత్నం చేస్తూ వుంటారు.ఈ లిస్టులో ‘సుదీర్ఘమైన ముద్దు’ పోటీ కూడా ఒక భాగమే.

గిన్నిస్‌ రికార్డుల ప్రకారం.అత్యంత సుదీర్ఘమైన ముద్దు రికార్డు థాయ్‌లాండ్‌కు( Thailand ) చెందిన ఓ జంట పేరిట ఉందనే విషయం మీరు వినే వుంటారు.2013 ఫిబ్రవరిలో వారు ఏకంగా 58 గంటల 35 నిమిషాలపాటు ముద్దుపెట్టుకొని గిన్నిస్ రికార్డ్ సాధించారు.

Telugu Guinness, Latest, Longest, Day-Latest News - Telugu

ఇక ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏమిటంటే ఈ ‘సుదీర్ఘమైన ముద్దు’( Longest Kiss ) రికార్డులకు స్వస్తి పలికినట్లు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ తాజాగా ప్రకటించింది.ఈ పోటీ చాలా ప్రమాదకరంగా మారడమే దీనికి కారణమని చెబుతున్నారు.దీంతోపాటు ఈ రికార్డుకు సంబంధించిన కొన్ని నియమాలు.సంస్థ ప్రస్తుత విధానాలకు విరుద్ధంగా ఉన్నాయని తన వెబ్‌సైట్‌లో రాసుకొచ్చింది.‘పాత నిబంధనల ప్రకారం.ఈ పోటీలో పాల్గొనే ఇద్దరి పెదవులు ఎప్పుడూ తాకి ఉండాలి.బ్రేక్‌ తీసుకునేందుకు అనుమతి లేదు.నిలబడి ఉండటంతోపాటు మెలకువ తప్పనిసరి.ఈ కఠిన నిబంధనల కారణంగా.

పాత రికార్డును బద్దలు కొట్టే ప్రయత్నంలో పోటీదారులు ఇబ్బందులపాలవుతున్న విషయం కూడా అకారణంగా చెప్పుకొచ్చారు.

Telugu Guinness, Latest, Longest, Day-Latest News - Telugu

ఇక ఎప్పటికప్పుడు రికార్డు సమయం కూడా బాగా పెరిగిపోతుండటంతో.కొంతమంది నిద్రలేమి సంబంధిత మనోవ్యాధులబారిన పడుతున్నట్లు కూడా వారు గుర్తించినట్టు జీడబ్ల్యూఆర్‌ తెలిపింది.కొన్ని ఉదంతాలను కూడా ఇందులో ప్రస్తావించడం విశేషం.

ఈ క్రమంలోనే.ఈ కేటగిరీని ‘సుదీర్ఘ ముద్దు మారథాన్‌’తో భర్తీ చేసింది.

ఇందులో నిబంధనల సడలింపు ఉంది.ప్రతి గంటకు 5 నిమిషాల బ్రేక్‌ తీసుకోవచ్చు.

ఇప్పటివరకు ఇందులో ఎవరూ రికార్డు సృష్టించలేదని గిన్నిస్‌ బుక్‌ వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube