ఆ దేశం రహస్యంగా దాచిపెట్టిన రసాయన ఆయుధాలు నేడు ధ్వంసం అవుతున్నాయి!

ఓ దేశం అత్యంత రహస్యంగా దాచిపెట్టిన రసాయన ఆయుధాలు( Chemical Weapons ) నేడు ధ్వంసం అవుతున్నాయి.ఆ దేశం మరేదో కాదు, అగ్రరాజ్యం అమెరికా.

 America To Destroy Last Of Its Chemical Weapons Details, America, Chemical Weapo-TeluguStop.com

( America ) ఒకప్పుడు అత్యంత రహస్యంగా నిల్వ చేసిన రసాయన ఆయుధాల చివరి విడత నిల్వల ధ్వంసం అక్కడ నేడు మొదలైంది.కొలరాడోలో ఆ దేశ సైన్యానికి చెందిన రసాయన డిపోల్లో వీటిని ధ్వంసం చేసే ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా చేపట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

దీనికోసం చాలా ప్రత్యేకమైన రోబోలను తెప్పించినట్టు భోగట్టా.ఈ డిపోలో అత్యంత ప్రమాదకరమైన ‘మస్టర్డ్‌ ఏజెంట్స్‌’తో( Mustard Agents ) చేసిన శతఘ్ని తూటాలున్నాయి.

వీటిని రోబోలు జాగ్రత్తగా విడదీసి, కడిగి, దాదపు 1,500 ఫారెన్‌హీట్‌ ఉష్ణానికి గురి చేస్తున్నట్టు తెలుస్తోంది.దీంతో ఆ తూటాలు తుక్కు వలే మారపోతాయని ఆర్మ్స్‌ కంట్రోల్‌ విభాగానికి చెందిన డిప్యూటి అసిస్టెంట్‌ డిఫెన్స్‌ సెక్రటరీ కింగ్‌స్టన్‌ రీఫ్‌ తాజాగా పేర్కొన్నారు.

Telugu America, Biological, Britain, Chemical, Colorado, Kentucky, Mud, Russia,

ఇకపోతే ప్యూబ్లో సమీపంలోని డిపోలో చివరి ఆయుధాన్ని జూన్‌లో ధ్వంసం చేసినట్లు తెలిపిన విషయం విదితమే.ఇక కెంటకీలోని మరో డిపోలో మిగిలిన రసాయన ఆయుధాల విధ్వంసం కూడా త్వరలోనే మొదలవుతుందని కూడా చెప్పుకొచ్చారు.ఈ ప్రక్రియ పూర్తయితే.ప్రపంచంలో అధికారికంగా ప్రకటించిన రసాయన ఆయుధాలు మొత్తం కనుమరుగైనట్లవుతాయని నిపుణులు అంటున్నారు.అమెరికా కొన్ని తరాలుగా ఈ రసాయన ఆయుధాల నిల్వలను పోగేసినట్టు తెలుస్తోంది.తొలి ప్రపంచ యుద్ధం( World War I ) తర్వాత ఆ ఆయుధాల విధ్వంసం తెలిసొచ్చింది.

కానీ, అమెరికా సహా పలు దేశాలు మాత్రం వాటిని భారీ స్థాయిలో అభివృద్ధి చేశాయి.

Telugu America, Biological, Britain, Chemical, Colorado, Kentucky, Mud, Russia,

అమెరికా వద్ద బయోలాజికల్‌ ఆయుధాలు( Biological Weapons ) కూడా ఒకప్పుడు భారీగా ఉండేవనే విషయం వివిధ దేశాలను తెలిసినదే.కానీ, 1970ల్లో వాటిలో కొన్నిటిని ధ్వంసం చేసింది.ఇక 1989లో తమ వద్ద ఉన్న రసాయన ఆయుధాలను ధ్వంసం చేయాలని సోవియట్‌, అమెరికా నిర్ణయించాయి.

ఇక బ్రిటన్‌ 2007లో, భారత్‌ 2009లో, రష్యా 2017లో తమ వద్ద ఉన్న రసాయన ఆయుధాలను ధ్వంసం చేసినట్లు అధికారికంగా పేర్కొన్నాయి.కానీ, రష్యా వద్ద ఇప్పటికీ రహస్యంగా ఈ రకం ఆయుధాలు ఉన్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి.

ఈ విషయమై అమెరికా గుర్రుగా వున్నారు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube