విజయ్ దేవరకొండ కోసం దిల్ రాజు రెడీ..!

లైగర్ రిజల్ట్ తేడా కొట్టడంతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమాల మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడు.

ఆల్రెడీ డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అవగా లైగర్ తో హిట్ ట్రాక్ ఎక్కుతాడని అనుకున్న విజయ్ దేవరకొండ హ్యాట్రిక్ ఫ్లాప్ అందుకున్నాడు.

ఆ సినిమాలైనా డిఫరెంట్ అటెంప్ట్ తో పర్లేదు అనిపించాడు కానీ లైగర్ పూర్తిగా నిరాశపరచాడు.ప్రస్తుతం శివ నిర్వాణ డైరక్షన్ లో ఖుషి సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.

Dil Raju Ready To Do Movie With Vijay Devarakonda , Devarakonda Vijay, Dil Raju,

ఈ సినిమా తర్వాత పూరీతో జన గణ మన లైన్ లో ఉంది.సుకుమార్ తో కూడా విజయ్ దేవరకొండ సినిమా ఒకటి ప్లానింగ్ లో ఉంది.

ఇక ఇదిలాఉంటే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా విజయ్ తో సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడట.ఆల్రెడీ అంతకుముందే దిల్ రాజు విజయ్ దేవరకొండకి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాడు.

Advertisement

ఇక మంచి కథ.డైరక్టర్ ఫిక్స్ అయితే ఈ కాంబో సినిమా కుదిరినట్టే. దిల్ రాజు తన కాంపౌండ్ లో ఉన్న అందరి దర్శకులకు విజయ్ కోసం ఓ అద్భుతమైన కథ రెడీ చేయమని చెప్పాడట.

మరి విజయ్ తో దిల్ రాజు ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు