మంత్రి ఉత్తమ్ తోనే గిరిజన తండాల అభివృద్ధి

సూర్యాపేట జిల్లా( Suryapet District):గిరిజన తండాల అభివృద్ధి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి( Uttamkumar Reddy ) తోనే సాధ్యమని సూర్యాపేట జిల్లా పాలకవీడు ఎంపీపీ భూక్య గోపాల్ నాయక్( MPP Bhukya Gopal Naik ) అన్నారు.సోమవారం మండలంలోని మీగడం పహాడ్ తండా గ్రామంలో రూ.

25 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డుపనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డితోనే గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని,మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తండాల అభివృద్ధికి ఎన్ఆర్ఈజీఎస్ నుండి రూ.25 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.గ్రామప్రజల పక్షాన మంత్రి ఉత్తమ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతి ప్రత్యేకాధికారి శ్రీనివాస్,మాజీ ఎంపిటిసిలు బెల్లంకొండ నరసింహరావు,సైదా, లక్ష్మ,నాయకులు భూక్యా చంద్రు,రూపావత్ బాగా, దశ్రు,సైదా,రామారావు, పాండు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News