నామినేషన్ల సందర్భంగా పోలీసు బందోబస్తు వివరాలు

సూర్యాపేట జిల్లా:అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ వేసే అభ్యర్థులు నియమ నిబంధనలు పాటించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే( Rahul Hegde ) అన్నారు.100 మీటర్ల పరిధిలోకి ఎవ్వరూ రాకుండా పూర్తి బారికేడింగ్ తో పోలీస్ నోడల్ ఆఫీసర్ల అధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా పోలీస్ నోడల్ అధికారులు వివరాలను వెల్లడించారుహుజూర్ నగర్ అసెంబ్లీ( Huzurnagar Assembly constituenc ) సెగ్మెంట్ కి జిల్లా అదనపు ఎస్పీ నాగేశ్వరరావు,సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంట్ కి డిఎస్పీ నాగభూషణం,కోదాడ అసెంబ్లీ సెగ్మెంట్ కి డిఎస్పీ ప్రకాష్ జాదవ్( Prakash jadhav ),తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి డిఎస్పీ రవి పోలీస్ నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారాన్నారు.100 మీటర్ల పరిధిలో ఇతరులకు,ర్యాలీలకు, వాహనాలకు అనుమతి లేదని,ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలన్నారు.నామినేషన్ ( Nomination )వేసే అభ్యర్థి తరపున 4 గురు వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని,సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తామన్నారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ నామినేషన్ కేంద్రం రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఇద్దరు సీఐలు,ఆరుగురు ఎస్ఐలు,రెండు సెక్షన్ల పారామిలటరీ బలగాల సిబ్బంది సహా 50 మంది సిబ్బందికి పైగా బందోబస్తు విధులు నిర్వర్తిస్తారన్నారు.ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా నోడల్ అధికారులు బందోబస్తు విధులు నిర్వర్తించాలని,100 మీటర్ల పరిధిలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.

షాకింగ్ వీడియో : తలుపు తీయగానే కాటేసిన పాము..

Latest Suryapet News